logo

పురుషులకు ప్రత్యేక తిరునాల

మదురై జిల్లా తిరుమంగళం సమీపం పెరుమాళ్‌ కోవిల్పట్టి గ్రామంలోని కరుంపారై ముత్తయ్య ఆలయంలో పురుషులు మాత్రమే పాల్గొనే తిరునాల శనివారం వైభవంగా జరిగింది.

Published : 19 May 2024 05:50 IST

సహపంక్తి భోజనం చేస్తున్న పురుషులు

ప్యారిస్, న్యూస్‌టుడే: మదురై జిల్లా తిరుమంగళం సమీపం పెరుమాళ్‌ కోవిల్పట్టి గ్రామంలోని కరుంపారై ముత్తయ్య ఆలయంలో పురుషులు మాత్రమే పాల్గొనే తిరునాల శనివారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి పొంగలి నైవేద్యంగా పెట్టి ఆరాధించారు. అనంతరం భక్తులు మొక్కులుగా చెల్లించిన 125 మేకలు బలిచ్చి 2500 కిలోల బియ్యంతో ఆహారం సిద్ధం చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. సుమారు 18 వేల మందికి పైగా పురుషులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని