logo

రూ.100కే మెట్రోలో అపరిమిత ప్రయాణం.. వారాంతపు రోజుల్లో అవకాశం

చెన్నై నగరానికి వచ్చే పర్యాటకులు, వారాంతపు రోజుల్లో షాపింగుకు వెళ్లాలనుకునే స్థానికులకు చెన్నై మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (సీఎంఆర్‌ఎల్‌) రూ.100తో సరికొత్త పథకాన్ని శనివారం ప్రకటించింది.

Published : 20 May 2024 05:32 IST

ప్రయాణ కార్డు

వడపళని, న్యూస్‌టుడే: చెన్నై నగరానికి వచ్చే పర్యాటకులు, వారాంతపు రోజుల్లో షాపింగుకు వెళ్లాలనుకునే స్థానికులకు చెన్నై మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (సీఎంఆర్‌ఎల్‌) రూ.100తో సరికొత్త పథకాన్ని శనివారం ప్రకటించింది. ‘వన్‌ డే టూరిస్ట్‌ కార్డ్‌’ను కొనుక్కుని వారాంతపు రోజుల్లో ఎన్నిసార్లయినా తిరిగే వీలుంటుందని తెలిపింది. రూ.150 చెల్లించి కార్డు తీసుకోవాలని, ఇందులో రూ.50 డిపాజిట్గా తీసుకుని, కార్డు తిరిగి ఇచ్చే సమయంలో రూ.50 తిరిగి చెల్లిస్తారని పేర్కొంది. ఏప్రిల్‌లో ప్రయాణికుల సంఖ్య 5.95 లక్షల మేరకు తగ్గింది. మార్చిలో 86.82 లక్షలు, ఏప్రిల్లో 80.87 లక్షల మంది ప్రయాణాలు సాగించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులను ఆకట్టుకునేందుకు కొత్త పథకాన్ని సీఎంఆర్‌ఎల్‌ ప్రవేశపెట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని