logo

13 ఏళ్ల కిందట బాలిక అదృశ్యం

అదృశ్యమైన బాలికను ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) సాంకేతికతతో గుర్తించేందుకు చెన్నై చర్యలు చేపట్టారు. చెన్నై సాలిగ్రామానికి చెందిన గణేశ్‌ కుమార్తె కవిత రెండేళ్ల వయసులో 2011లో అదృశ్యమైంది.

Published : 21 May 2024 00:34 IST

ఏఐతో గుర్తించేందుకు చర్యలు

బాలిక చిన్నప్పటి ఫొటో,  ఏఐతో రూపొందించిన చిత్రం

ప్యారిస్, న్యూస్‌టుడే: అదృశ్యమైన బాలికను ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) సాంకేతికతతో గుర్తించేందుకు చెన్నై చర్యలు చేపట్టారు. చెన్నై సాలిగ్రామానికి చెందిన గణేశ్‌ కుమార్తె కవిత రెండేళ్ల వయసులో 2011లో అదృశ్యమైంది. విరుగంబాక్కం పోలీసులు కేసు నమోదు చేసుకుని బాలిక కోసం గాలిస్తున్నారు. ఎలాంటి సమాచారం తెలియకపోవడంతో బాలికను గుర్తించేందుకు ఏఐ సాంకేతికత ఉపయోగిస్తున్నారు. బాలిక ప్రస్తుతం 14 ఏళ్ల వయసులో ఎలా ఉంటుందో ఏఐ ద్వారా చిత్రీకరించారు. ఈ రెండు ఫొటోలను కలిపి పోలీసులు పోస్టర్‌ విడుదల చేశారు. కవిత గురించి సమాచారం తెలిసిన వారు 94444 15815, 94981 79171 నెంబర్లకు తెలపాలని, గుర్తించిన వారికి రివార్డు అందించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు