logo

కాంగ్రెస్‌ నుంచి వైదొలగినవారిని మళ్లీ చేర్చుకోం

కాంగ్రెస్‌ నుంచి వైదొలగినవారిని మళ్లీ పార్టీలోకి చేర్చుకోబోమని పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి స్పష్టం చేశారు. దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ సార్మక దినం సందర్భంగా ఏటా కర్ణాటక కాంగ్రెస్‌ కార్మికుల విభాగం తరఫున రాజీవ్‌గాంధీ జ్యోతియాత్ర జరుగుతుంది.

Published : 21 May 2024 00:36 IST

పుదువై మాజీ సీఎం నారాయణస్వామి

జ్యోతియాత్రను సాగనంపుతున్న కాంగ్రెస్‌ నేతలు

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ నుంచి వైదొలగినవారిని మళ్లీ పార్టీలోకి చేర్చుకోబోమని పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి స్పష్టం చేశారు. దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ సార్మక దినం సందర్భంగా ఏటా కర్ణాటక కాంగ్రెస్‌ కార్మికుల విభాగం తరఫున రాజీవ్‌గాంధీ జ్యోతియాత్ర జరుగుతుంది. ఈ ఏడాది యాత్ర గత 15న బెంగళూరులో ప్రారంభమై కోయంబత్తూర్, పాలక్కాడు,  తిరుచూర్, తిరువనంతపురం, కన్నియాకుమరి, నాగర్‌కోవిల్, మదురై మీదగా సోమవారం పుదుచ్చేరికి చేరింది. జ్యోతియాత్రను సాగనంపే కార్యక్రమం రెడ్డ్డియార్‌పాళ్యంలో జరిగింది. మాజీ సీఎం నారాయణస్వామి, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వైద్యలింగం, మాజీమంత్రులు తదితరులు పాల్గొన్నారు. నారాయణస్వామి మాట్లాడుతూ ప్రధాని మోదీ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో తన పాలనకాలంలో పదేళ్లపాటు చేసిన పనుల గురించి చెప్పలేకపోయారన్నారు. మళ్లీ పాలనలోకి వస్తే ఏం చేస్తామో కూడా చెప్పలేకపోతున్నారని తెలిపారు. భాజపాకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధమైపోయారన్నారు. పదవి, డబ్బుకు ఆశపడి కాంగ్రెస్‌ నుంచి వెళ్లిపోయినవారిని తిరిగి పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు