logo

నైరుతి బంగాళాఖాతంలో 22న అల్పపీడనం

రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం సోమవారం విడుదల చేసిన ప్రకటనలో..

Published : 21 May 2024 00:37 IST

ప్యారిస్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం సోమవారం విడుదల చేసిన ప్రకటనలో.. దక్షిణ తమిళనాడు సముద్రతీర ప్రాంతాలు, ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం నెలకొందని తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఈశాన్య దిశగా పయనించి మధ్య బంగాళాఖాతంలో 24న వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. తమిళనాడులో మంగళవారం చాలాచోట్ల, పుదుచ్చేరి, కారైక్కల్‌లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తేని, విరుదునగర్, తెన్‌కాశి జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, కన్నియాకుమరి, తిరునెల్వేలి, మదురై, దిండుక్కల్, తిరుప్పూర్, కోయంబత్తూరు, నీలగిరి, శివగంగై, పుదుక్కోట్టై, తంజావూరు, తిరువారూరు, నాగపట్టణం, మైలాడుతురై జిల్లాలు, కారైక్కల్‌లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 22న రాష్ట్రంలో అనేక చోట్ల, పుదుచ్చేరి, కారైక్కల్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని, తేని, తిరునెల్వేలి, కన్నియాకుమరి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీవర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. 23న రాష్ట్రంలో కొన్నిచోట్ల, పుదుచ్చేరి, కారైక్కల్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని, కన్నియాకుమరి, తిరునెల్వేలి, తెన్‌కాశి, కృష్ణగిరి, ధర్మపురి, తిరుప్పత్తూరు జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల భారీ వర్షానికి అవకాశం ఉందని, చెన్నైలో రాబోయే 48 గంటల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, నగరంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన జాలర్లు 23లోపు తీరానికి చేరుకోవాలని హెచ్చరించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని