logo

బంకమట్టి, అట్టపెట్టెలతో రాయల్‌ఎన్‌ఫీల్డ్‌

బంకమట్టి, అట్టపెట్టెలతో ఓ విద్యార్థిని రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ వాహనం తయారు చేసింది. శ్రీకమలి అనే విద్యార్థిని తిరుప్పూర్‌ మదలిపాళ్యంలోని నిఫ్ట్‌-టీ అనే నిట్టింగ్, ష్యాషన్‌ డిజైనింగ్‌ కళాశాలలో  కాస్ట్యూమ్‌ డిజైనింగ్, ఫ్యాషన్‌ విభాగంలో మూడో ఏడాది చదువుతోంది.

Published : 21 May 2024 00:41 IST

తయారుచేసిన వాహనంతో శ్రీకమలి

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: బంకమట్టి, అట్టపెట్టెలతో ఓ విద్యార్థిని రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ వాహనం తయారు చేసింది. శ్రీకమలి అనే విద్యార్థిని తిరుప్పూర్‌ మదలిపాళ్యంలోని నిఫ్ట్‌-టీ అనే నిట్టింగ్, ష్యాషన్‌ డిజైనింగ్‌ కళాశాలలో  కాస్ట్యూమ్‌ డిజైనింగ్, ఫ్యాషన్‌ విభాగంలో మూడో ఏడాది చదువుతోంది. బొగ్గు, కాగితం, కార్డ్‌బోర్డు ఉపయోగించి పలు ఆకృతులు సిద్ధం చేస్తుంటుంది. తాజాగా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ద్విచక్ర వాహనం రూపొందించింది. ఇందుకు 157 రోజులు శ్రమించింది. బంకమట్టి, అట్టపెట్టెలు ఉపయోగించి వాహనంలో ఉండే అన్ని భాగాలనూ తయారుచేసింది. నిజమైన ద్విచక్ర వాహనంలానే కనిపించడంతో పలువురు ఆమెను అభినందిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు