logo

పుదుచ్చేరిలో గంజాయి విక్రయాలకు అడ్డుకట్ట వేస్తాం

పుదుచ్చేరిలో మూడునెలల్లోపు గంజాయి రవాణా, విక్రయాలకు పూర్తిగా అడ్డుకట్ట వేస్తామని ఇన్‌ఛార్జ్‌ ఎల్జీ సీపీ రాధాకృష్ణన్‌ అన్నారు. లేదంటే రాజ్‌నివాస్‌కే వచ్చి అడగవచ్చన్నారు.

Published : 21 May 2024 00:44 IST

గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌

ఆలయంలో గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: పుదుచ్చేరిలో మూడునెలల్లోపు గంజాయి రవాణా, విక్రయాలకు పూర్తిగా అడ్డుకట్ట వేస్తామని ఇన్‌ఛార్జ్‌ ఎల్జీ సీపీ రాధాకృష్ణన్‌ అన్నారు. లేదంటే రాజ్‌నివాస్‌కే వచ్చి అడగవచ్చన్నారు. కారైక్కాల్‌ సమీపంలోని తిరునల్ల్లారు దర్బారణేశ్వర ఆలయ బ్రహోత్సవాల్లో ముఖ్య కార్యక్రమమైన రథోత్సవం సోమవారం జరిగింది. సీపీ రాధాకృష్ణన్, మంత్రి తిరుమురుగన్‌ పాల్గొని రథాన్ని లాగారు. అనంతరం సీపీ రాధాకృష్ణన్‌ విలేకరులతో మాట్లాడుతూ.. తమిళనాడులో గంజాయి విక్రయం అధికంగా ఉందని, అందుకు ముఖ్యమంత్రిదే పూర్తి బాధ్యత అన్నారు. పుదుచ్చేరిలో గంజాయి రవాణా సాగితే గవర్నర్‌దే పూర్తి బాధ్యత అన్నారు. తాను, ముఖ్యమంత్రి కలిసి గంజాయి బాధితులను కాపాడేందుకు పూర్తి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పుదుచ్చేరిలో విద్యను మెరుగుపరిచేందుకు అన్ని చర్యలు చేపడతామన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని