logo

పలు భాషల్లోకి పార్కింగ్‌

రాంకుమార్‌ బాలకృష్ణన్‌ దర్శకత్వంలో హరీశ్‌ కల్యాణ్, ఎం.ఎస్‌.భాస్కర్‌ ప్రధాన పాత్రధారులుగా గత డిసెంబరు 1న విడుదలైన చిత్రం ‘పార్కింగ్‌’. ఒకే భవనంలో పైఅంతస్తు,

Published : 21 May 2024 01:43 IST

చెన్నై, న్యూస్‌టుడే: రాంకుమార్‌ బాలకృష్ణన్‌ దర్శకత్వంలో హరీశ్‌ కల్యాణ్, ఎం.ఎస్‌.భాస్కర్‌ ప్రధాన పాత్రధారులుగా గత డిసెంబరు 1న విడుదలైన చిత్రం ‘పార్కింగ్‌’. ఒకే భవనంలో పైఅంతస్తు, కింది అంతస్తులో బాడుగకు ఉండేవారి మధ్య ఏర్పడిన పార్కింగ్‌ సమస్య నేపథ్యంతో రూపొందిన చిన్న బడ్జెట్‌ చిత్రమిది. ప్రేక్షకుల విశేష ఆదరణాభిమానాలు పొందిన ఈ చిత్రం పునర్నిర్మాణ హక్కులను పెద్ద మొత్తానికి విక్రయించారు. ఆ మేరకు ఐదు భారతీయ భాషలు, ఓ అంతర్జాతీయ భాషలో చిత్రం పునర్నిర్మాణం కానుందని కోలీవుడ్‌ సమాచారం.


మళై పిడిక్కాద మనిదన్‌ టీజర్‌ 29న

చిత్రం పోస్టరు

చెన్నై, న్యూస్‌టుడే: విజయ్‌ ఆంటోని, శరత్‌కుమార్‌ కలిసి నటించిన చిత్రం ‘మళై పిడిక్కాద మనిదన్‌’. విజయ్‌ ఆంటోని స్వీయ దర్శకత్వంలోని ఈ సినిమాలో సత్యరాజ్, డాలి ధనంజయ, మురళీశర్మ, మేఘా ఆకాశ్, తలైవాసల్‌ విజయ్, శరణ్య పొన్‌వణ్ణన్‌ తదితరులు నటించారు. టీజర్‌ 29న విడుదల కానుందని చిత్రబృందం ప్రకటించింది. 


అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో కొట్టుకాళి

చెన్నై, న్యూస్‌టుడే: ‘ది లిటిల్‌ వేవ్‌ ప్రొడక్షన్స్‌’తో నటుడు శివకార్తికేయన్‌కు చెందిన ఎస్‌కే ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘కొట్టుకాళి’. వినోద్‌రాజ్‌ దర్శకత్వంలోని ఈ చిత్రంలో నటుడు సూరి, మలయాళ నటి అన్నా బెన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. 74వ బెర్లిన్‌ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించడానికి ‘కొట్టుకాళి’ ఎంపికైంది. ఓ తమిళ చిత్రం ఈ గౌరవాన్ని దక్కించుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రస్తుతం రొమేనియాలోని ట్రాన్సిల్వేనియా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లోనూ ప్రదర్శనకు ఎంపికైంది. చిత్ర దర్శకుడు వినోద్‌రాజ్‌ గతంలో దర్శకత్వం వహించిన ‘కూళాంకల్‌’ కూడా ట్రాన్సిల్వేనియా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించడం గమనార్హం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని