logo

ప్రధాని మోదీకి హత్యా బెదిరింపులు

ప్రధాని నరేంద్ర మోదీని చంపుతామని ఫోన్‌ చేసి బెదిరింపులకు పాల్పడిన వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Published : 24 May 2024 01:09 IST

ప్యారిస్, న్యూస్‌టుడే: ప్రధాని నరేంద్ర మోదీని చంపుతామని ఫోన్‌ చేసి బెదిరింపులకు పాల్పడిన వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌ నుంచి చెన్నై పురసైవాక్కంలోని ఎన్‌ఐఏ కార్యాలయానికి బుధవారం రాత్రి ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేశాడు. ప్రధాని మోదీని చంపుతామని హిందీలో బెదిరించాడు. మోదీ ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నారని, ఆయన ర్యాలీలో హత్య చేయడానికి ప్రణాళిక రచించినట్లు చెప్పి ఫోన్‌ కట్‌ చేశాడు. వెంటనే అప్రమత్తమైన ఎన్‌ఐఏ అధికారులు.. చెన్నై పోలీసు కమిషనరు కార్యాలయానికి సమాచారం అందించారు. కమిషనరు సందీప్‌రాయ్‌ రాథోర్‌ ఆదేశాల మేరకు సెంట్రల్‌ క్రైం బ్రాంచ్‌ పరిధిలో ఉన్న సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్‌ పోలీసులు, ఎన్‌ఐఏ ఉన్నతాధికారులకు తెలియజేసి దర్యాప్తు తీవ్రతరం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని