logo

సవుక్కు శంకర్‌పై మరో ఫిర్యాదు

తన కుమార్తె, తన కుటుంబంపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన సవుక్కు శంకర్‌పై చర్యలు తీసుకోవాలని కళ్లకుర్చికి చెందిన సెల్వి గురువారం  పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Published : 24 May 2024 01:15 IST

పోలీసుల అదుపులో సవుక్కు శంకర్‌ 

వేళచ్చేరి, న్యూస్‌టుడే: తన కుమార్తె, తన కుటుంబంపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన సవుక్కు శంకర్‌పై చర్యలు తీసుకోవాలని కళ్లకుర్చికి చెందిన సెల్వి గురువారం  పోలీసులకు ఫిర్యాదు చేసింది. సవుక్కు మీడియా యూట్యూబ్‌ ఛానెల్‌లో 2022 జులై 20న కళ్లకురిచ్చి వ్యవహారం పేరిట సవుక్కు శంకర్‌ వీడియో విడుదల చేశారని గుర్తు చేశారు. తమపై బురద జల్లేలా వ్యాఖ్యలు చేశారని, అప్పట్లో తన వద్ద ఆధారాలు లేవన్నారు. సవుక్కు శంకర్‌ వద్ద సహాయకుడిగా పనిచేసిన ప్రదీప్‌ అనే వ్యక్తి ప్రైవేటు ఛానెల్‌కు ఇచ్చిన భేటీలో కళ్లకురిచ్చి  వ్యవహారంలో సవుక్కు శంకర్‌ డబ్బులు తీసుకొని తప్పుడు వ్యాఖ్యలు చేశాడని తెలిపారన్నారు. సవుక్కు శంకర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. సైబర్‌ క్రైం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

బెయిల్‌ పిటిషన్‌ విచారణ వాయిదా

ప్యారిస్‌: యూట్యూబర్‌ సవుక్కు శంకర్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను కోర్టు వాయిదా వేసింది. మహిళా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కోయంబత్తూరు సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. తేనిలో ఉన్న సమయంలో గంజాయితో ఉన్నట్లు అతనిపై, అతని సహాయకుడు రాజారత్నం, డ్రైవర్‌ రామ్‌ ప్రభులపై తేని పోలీసులు కేసు నమోదు చేశారు. తేని పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్‌ కోరి సవుక్కు శంకర్‌ మదురై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను గురువారం విచారించిన కోర్టు 27వ తేదీకి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని