logo

జయలలితకు మత విశ్వాసాల్లేవు: శశికళ

జయలలితకు దైవ నమ్మకం ఉండేదని, మత విశ్వాసాల్లేవని ఆమె నెచ్చెలి శశికళ తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత హిందుత్వ సిద్ధాంతాలు పాటించేవారని దిల్లీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తమిళనాడు భాజపా అధ్యక్షుడు అన్నామలై పేర్కొన్నారు.

Published : 26 May 2024 02:48 IST

సైదాపేట, న్యూస్‌టుడే: జయలలితకు దైవ నమ్మకం ఉండేదని, మత విశ్వాసాల్లేవని ఆమె నెచ్చెలి శశికళ తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత హిందుత్వ సిద్ధాంతాలు పాటించేవారని దిల్లీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తమిళనాడు భాజపా అధ్యక్షుడు అన్నామలై పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను అన్నాడీఎంకే నేతలు ఖండిస్తున్నారు. ఇందుకు సంబంధించి శశికళ విడుదల చేసిన ప్రకటనలో... జయలలిత గురించి అన్నామలై చేసిన వ్యాఖ్యలు ఆయన అజ్ఞానం తెలియజేస్తున్నాయన్నారు. కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారు అభిమానించే గొప్ప నాయకురాలిగా జయలలిత జీవించారని అన్నారు. ప్రజల కోసం జీవితాన్ని అర్పించారని గుర్తు చేశారు. అలాంటి గొప్ప నాయకురాలిని ప్రత్యేక మతానికో, కులానికో పరిమితం చేయలేరని తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు