logo

చెన్నైలో ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుల అరెస్టు

ఉగ్రవాద సంస్థ సానుభూతిపరులు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైలో ఉగ్రవాద సంస్థకు రాయపేటలో ఉంటున్న ముగ్గురు మద్దతుగా వ్యవహరిస్తున్నట్లు చెన్నై పోలీసులకి సమాచారం అందింది.

Published : 26 May 2024 02:49 IST

ప్యారిస్, న్యూస్‌టుడే: ఉగ్రవాద సంస్థ సానుభూతిపరులు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైలో ఉగ్రవాద సంస్థకు రాయపేటలో ఉంటున్న ముగ్గురు మద్దతుగా వ్యవహరిస్తున్నట్లు చెన్నై పోలీసులకి సమాచారం అందింది. ఆ మేరకు సైబర్‌ క్రైం పోలీసులు రాయపేటలో దర్యాప్తు తీవ్రతరం చేశారు. ‘హిస్బ్‌ ఉద్‌ తాహిర్‌’ అనే ఉగ్రవాద సంస్థకు మద్దతుగా రాయపేటకి చెందిన డాక్టర్‌ హమీద్‌ హుస్సేన్, అతని తండ్రి అహ్మద్‌ అన్సూర్, తమ్ముడు అబ్దుల్‌కుమాన్‌లు పనిచేస్తున్నట్లు తెలిసింది. హమీద్‌ హుస్సేన్‌ అన్నా వర్సిటీలో ప్రొఫెసరుగా పని చేస్తున్నాడు. అనంతరం వారిని కమిషనరు కార్యాలయానికి తీసుకెళ్లి దర్యాప్తు చేయగా.. ప్రతి ఆదివారం తమ యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా ఉగ్రవాద పోరాటానికి సంబంధించిన అభిప్రాయాలు పోస్టు చేసి, ప్రచారం చేసి, సంస్థలో కొత్తవారిని చేరుస్తున్నట్లు తెలిసింది. దీంతో ముగ్గురిని అరెస్టు చేసి జైల్లో వేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఉగ్రవాద నియంత్రణ విభాగ పోలీసులు, ఎన్‌ఐఏ అధికారులు దర్యాప్తు చేపట్టారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని