logo

ఇండియా కూటమి పాలనలోకి వచ్చిన 3నెలల్లోనే పుదువైకు రాష్ట్ర హోదా

ఇండియా కూటమి పాలనలోకి వచ్చిన మూడునెలల్లోపు పుదుచ్చేరికి రాష్ట్ర హోదా ఇస్తారని మాజీ సీఎం నారాయణస్వామి అన్నారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ..

Published : 26 May 2024 02:54 IST

విలేకరులతో మాట్లాడుతున్న నారాయణస్వామి

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: ఇండియా కూటమి పాలనలోకి వచ్చిన మూడునెలల్లోపు పుదుచ్చేరికి రాష్ట్ర హోదా ఇస్తారని మాజీ సీఎం నారాయణస్వామి అన్నారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీ ఇష్టానుసారం లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యలు  చేయడం అందరూ చూస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్, కూటమి పార్టీలు ఇస్లామ్, ఉగ్రవాదాన్ని మద్దతిచ్చే పార్టీ అని, వారు పాలనలోకి వస్తే రాముడి ఆలయాన్ని కూల్చివేస్తారని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. తాను అవతారపురుషుడినని చెప్పుకొంటున్నారన్నారు. ఆరు విడతల ఎన్నికల్లో ఇండియా కూటమికే అధికస్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ కూటమికి 300 స్థానాలు వస్తాయన్నారు. తమిళనాడు, పుదుచ్చేరిలో ఇండియా కూటమి 40 స్థానాలు గెలుచుకుంటుందని చెప్పారు. తమిళనాడు గవర్నర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారారని విమర్శించారు. పుదువై ప్రస్తుత ముఖ్యమంత్రి రాష్ట్ర హోదా తీసురాలేకపోయారని, ఇండియా కూటమి పాలనలోకి వచ్చిన మూడునెలల్లోనే హోదా తెప్పిస్తామని మేనిఫేస్టోలో ప్రకటించిందన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని