logo

ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి

చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిలో ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ తెలిపారు.

Published : 01 Dec 2022 00:45 IST

కమల్‌హాసన్‌

శ్రీప్రియ నివాసంలో కమల్‌హాసన్‌, నిర్వాహకులు

వేలచ్చేరి, న్యూస్‌టుడే: చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిలో ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ తెలిపారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో... చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిపై 2018 జనవరి నుంచి జూన్‌ వరకు జరిగిన ప్రమాదాల్లో 2 వేలకు పైగా మృతి చెందారని, 7 వేల మందికి పైగా గాయపడ్డారని తెలిపారు. ఈ మార్గంలో ప్రమాదాలను నివారించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

శ్రీప్రియకు పరామర్శ

వేలచ్చేరి: పార్టీ నిర్వాహక కమిటీ సభ్యురాలు, నటి శ్రీప్రియను తల్లి ఇటీవల మృతిచెందారు. ఈ నేపథ్యంలో బుధవారం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌, నిర్వాహకులు శ్రీప్రియ నివాసానికి వెళ్లి ఆమెను పరామర్శించారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని