logo

Cell phones: ఆలయాల్లో సెల్‌ఫోన్‌ నిషేధం.. చర్యలు చేపట్టాలని దేవాదాయశాఖకు ఆదేశాలు

రాష్ట్రంలో అన్ని ఆలయాల్లో సెల్‌ఫోన్‌ ఉపయోగానికి నిషేధం విధించడానికి దేవాదాయశాఖ కమిషనరు చర్యలు చేపట్టాలని మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది.

Updated : 03 Dec 2022 09:37 IST

ప్యారిస్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అన్ని ఆలయాల్లో సెల్‌ఫోన్‌ ఉపయోగానికి నిషేధం విధించడానికి దేవాదాయశాఖ కమిషనరు చర్యలు చేపట్టాలని మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. తిరుచ్చెందూర్‌ సుబ్రమణి స్వామి ఆలయంలో సెల్‌ఫోన్‌ ఉపయోగానికి నిషేధం విధించాలని కోరుతూ అర్చకుడు పిటిషన్‌ దాఖలు చేశారు. ఇది శుక్రవారం విచారణకు వచ్చింది. ఈ మేరకు నిషేధం విధించినట్లు అధికారులు చెప్పారు. ఆలయ పవిత్రతను కాపాడేలా అన్ని ఆలయాల్లో ఈ నిబంధన, భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి రావాలనే ఉత్తర్వులను దేవాదాయశాఖ కమిషనరు అమలు చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని