logo

ఆర్థిక బలం లేకపోతే దేనినీ కాపాడలేం

కోయంబత్తూరులోని ఇషా కేంద్రంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సద్గురు జగ్గీవాసుదేవ్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

Updated : 27 Jan 2023 06:03 IST

సద్గురు

ఇషాలో జాతీయ జెండాను ఎగురవేసిన సద్గురు

ప్యారిస్‌, న్యూస్‌టుడే: కోయంబత్తూరులోని ఇషా కేంద్రంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సద్గురు జగ్గీవాసుదేవ్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ...దేశంలో ఉంటున్న మనం కులం, మతం, జాతి, భాషా, ఆహారపు అలవాట్లు, సంస్కృతి అని పలు విధాలుగా భిన్నంగా ఉన్నామన్నారు. స్వాతంత్య్రానికి ముందు 600 మందికి పైగా సామంతులు పాలించారని, బయటి నుంచి వచ్చిన వారు మనల్ని హిందుస్థాన్‌ లేదా భారతం అని ఒకటే పేరుతో పిలిచారని తెలిపారు. 300 ఏళ్లకు ముందు ప్రపంచ స్థాయిలో బలమైన దేశంగా భారతదేశం ఉందని, ఆ పరిస్థితిని మళ్లీ చేరేలా ప్రస్తుతం చర్యలు చేపట్టారని తెలిపారు. ఆర్థిక బలం లేకపోతే సంస్కృతి, ఆధ్యాత్మికం వంటి వాటిని కాపాడలేమని చెప్పారు. మన మధ్య ఉన్న వ్యత్యాసాలను దాటి ఏది మనల్ని ఐక్యంగా ఉంచే విషయాన్ని బలపరచాలని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని