logo

Actress Jayalakshmi: నటి జయలక్ష్మికి బెయిల్‌

స్నేహం ఫౌండేషన్‌ అవినీతి కేసులో అరెస్టయిన నటి జయలక్ష్మి బెయిల్‌పై విడుదలయ్యారు.

Updated : 24 Feb 2024 09:22 IST

రెడ్‌హిల్స్‌, న్యూస్‌టుడే: స్నేహం ఫౌండేషన్‌ అవినీతి కేసులో అరెస్టయిన నటి జయలక్ష్మి బెయిల్‌పై విడుదలయ్యారు. నటుడు స్నేహన్‌ మక్కళ్‌ నీది మయ్యం ‘స్నేహం ఫౌండేషన్‌’ పేరిట ట్రస్టు నిర్వహిస్తున్నారు. ఈ ట్రస్టు పేరిట లక్షలాది రూపాయలు విరాళాలు సేకరించి నటి జయలక్ష్మి మోసానికి పాల్పడినట్లు స్నేహన్‌ 2022లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తిరుమంగళం పోలీసులు ఆమెను గత నెల 20న చెన్నై అన్నానగర్‌లో అరెస్టు చేసి పుళల్‌ జైల్లో ఉంచారు. ఈ నేపథ్యంలో బెయిల్‌ మంజూరు చేయాలని ఆమె కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు ఆమెకు బెయిల్‌ మంజూరు చేయడంతో శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని