logo

Crime News: హోటల్‌ మరుగుదొడ్డిలో సెల్‌ఫోన్‌తో వీడియో

సేలం జిల్లా సూరమంగళం మెయిన్‌రోడ్‌లోని ఏవీఆర్‌ రౌండ్‌ఠాణా వద్ద ఉన్న ఓ ప్రముఖ హోటల్‌లోని మరుగుదొడ్డికెళ్లిన మహిళ అక్కడ రహస్యంగా సెల్‌ఫోన్‌ ఉండడాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Updated : 25 Feb 2024 09:26 IST

పోలీసుల అదుపులో శుభ్రతా కార్మికుడు

అరెస్టయిన నిందితుడు

సేలం: సేలం జిల్లా సూరమంగళం మెయిన్‌రోడ్‌లోని ఏవీఆర్‌ రౌండ్‌ఠాణా వద్ద ఉన్న ఓ ప్రముఖ హోటల్‌లోని మరుగుదొడ్డికెళ్లిన మహిళ అక్కడ రహస్యంగా సెల్‌ఫోన్‌ ఉండడాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు అక్కడకు చేరుకుని సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని సుమారు రెండు గంటలపాటు ఆన్‌లో ఉన్నట్లు గుర్తించారు. సెల్‌ఫోన్‌ నెంబరు ఆధారంగా నిందితుడు అదే హోటల్‌లో శుభ్రతా పనులు చేస్తున్న విజయ్‌గా గుర్తించి అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని