logo

మేనకోడలికి 300 రకాల సారె అందించిన మేనమామలు

దిండుక్కల్‌ జిల్లా కొడైకెనాల్‌ కేసీ పట్టి గ్రామానికి చెందిన ఐయ్యప్పన్‌ జిల్లా చెక్క వ్యాపారుల సంఘ అధ్యక్షుడు. ఇతని కుమార్తె దీప అక్షుకు పుష్పవతి వేడుక ఘనంగా నిర్వహించారు.

Published : 29 Feb 2024 06:55 IST

ఊరేగింపుగా సారె తెస్తున్న దృశ్యం

న్యూస్‌టుడే, ఆర్కేనగర్‌: దిండుక్కల్‌ జిల్లా కొడైకెనాల్‌ కేసీ పట్టి గ్రామానికి చెందిన ఐయ్యప్పన్‌ జిల్లా చెక్క వ్యాపారుల సంఘ అధ్యక్షుడు. ఇతని కుమార్తె దీప అక్షుకు పుష్పవతి వేడుక ఘనంగా నిర్వహించారు. ముగ్గురు మేనమామలు ఆమెకు స్థానికులు ఆశ్చర్యపడేలా సారె అందించారు. అరటి, ద్రాక్ష, బియ్యం, పప్పుదినుసులు, మిఠాయిలు, నగలు, వస్త్రాలు తదితర 300 రకాల సారెను తలపై పెట్టుకొని లారీలో మేళతాళాల మధ్య తీసుకొచ్చారు. సారెను చూసి చుట్టుపక్కల కొండప్రాంత గిరిజన ప్రజలు ఆశ్చర్యపోయారు. వేడుకలో పాల్గొన్నవారికి పలు రకాల వంటకాలతో రుచికరమైన విందుభోజనం పెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని