logo

నారాయణస్వామి ఆస్తి వివరాలు తెలియజేయాలి

నారాయణస్వామి తన ఆస్తి వివరాలు తెలియజేయాలని పుదుచ్చేరి సీఎం రంగసామి డిమాండ్‌ చేశారు. పుదుచ్చేరి లోక్‌సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి నమశ్శివాయంకు మద్దతుగా ఉప్పలప్రాంతంలో ప్రచారం చేశారు.

Published : 03 Apr 2024 00:09 IST

పుదువై సీఎం రంగసామి

మాట్లాడుతున్న సీఎం రంగసామి

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: నారాయణస్వామి తన ఆస్తి వివరాలు తెలియజేయాలని పుదుచ్చేరి సీఎం రంగసామి డిమాండ్‌ చేశారు. పుదుచ్చేరి లోక్‌సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి నమశ్శివాయంకు మద్దతుగా ఉప్పలప్రాంతంలో ప్రచారం చేశారు. రంగసామి మాట్లాడుతూ.. నమశ్శివాయంకు రూ.వెయ్యికోట్ల ఆస్తులు ఉన్నాయని నారాయణస్వామి అంటున్నారన్నారన్నారు. నారాయణస్వామి ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, 15ఏళ్లు రాజ్యసభ ఎంపీగా ఉన్నారని, మరి ఆయనకు ఇంకెన్ని రూ.కోట్ల ఆస్తులు ఉంటాయోనని ప్రశ్నించారు. ఇంతటి ధనవంతుడు ఉన్నారంటే పుదుచ్చేరి ఎంతో పుణ్యం చేసుకున్నట్లేనని చెప్పారు.


పేదలకు కొత్త ఇళ్లు: జయవర్ధన్‌

సైదాపేట, న్యూస్‌టుడే: పేదలకు కొత్త హౌసింగ్‌ బోర్డు ఇళ్లు అందించేందుకు కృషి చేస్తానని దక్షిణ చెన్నై అన్నాడీఎంకే అభ్యర్థి జయవర్ధన్‌ తెలిపారు. మంగళవారం గిండి ప్రాంతంలో ఎన్నికల ప్రచారం చేశారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు దక్షిణ చెన్నై ప్రాంతంలో శిథిలావస్థలో ఉండే హౌసింగ్‌ బోర్డు ఇళ్లకు బదులు కొత్తవి నిర్మించాలని పార్లమెంట్‌లో డిమాండ్‌ చేశానని తెలిపారు. ఆ మేరకు పలు ఇళ్లు నిర్మించారన్నారు. ఐదేళ్లలో ఎవరూ ఈ విషయంపై పార్లమెంట్‌లో గళం విప్పలేదన్నారు. ఆయన వెంట అన్నాడీఎంకే మాజీ మంత్రి గోకుల ఇందిరా, జిల్లా కార్యదర్శి విరుగై రవి తదితరులు ఉన్నారు.


భాజపా పాలనలోకి వస్తే పోలింగ్‌కేంద్రాలే ఉండవు

మంత్రి అన్బిల్‌ మహేష్‌

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: దేశంలో ఇండియా కూటమి పాలనలోకి వస్తే టోల్‌గేట్లే ఉండవని, అదే భాజపా అధికారంలోకి వస్తే పోలింగ్‌ కేంద్రాలనేవి ఉండబోవని మంత్రి అన్బిల్‌ మహేష్‌ అన్నారు. తంజావూర్‌ డీఎంకే అభ్యర్థి మురసొలికి మద్దతుగా మంగళవారం మంత్రి అన్బిల్‌ మహేష్‌ తిరువైయారు శాసనసభ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. అప్పుడాయన మాట్లాడుతూ.. రాష్ట్రం మొత్తం ఇండియా కూటమికి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. మహిళల మద్దతు అధికంగా ఉందన్నారు. పదేళ్ల కిందట భాజపా పాలనలోకి వచ్చేటప్పుడు రూ.400 ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ ధర ఇప్పుడు రూ.వెయ్యికి పైగా పెరిగిందన్నారు. మహిళా దినోత్సవం పేరిట ధరలు తగ్గించామని నాటకాలు ఆడుతున్నారని చెప్పారు. రూ.15 లక్షలు అకౌంట్లో వేస్తామని మోసం చేశారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని