logo

హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తున్నారు

హామీలు నెరవేర్చకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్‌ అన్నారు. తిరుచ్చి లోక్‌సభ నియోజకవర్గంలో అన్నాడీఎంకే తరఫున పోటీ చేస్తున్న కరుపయ్యకు మద్దతుగా మరక్కడైలో ప్రచారం చేశారు.

Published : 03 Apr 2024 00:18 IST

ప్రేమలత విజయకాంత్‌

ప్రచారంలో ప్రసంగిస్తున్న ప్రేమలత

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: హామీలు నెరవేర్చకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్‌ అన్నారు. తిరుచ్చి లోక్‌సభ నియోజకవర్గంలో అన్నాడీఎంకే తరఫున పోటీ చేస్తున్న కరుపయ్యకు మద్దతుగా మరక్కడైలో ప్రచారం చేశారు. ఆమె మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో అతిపెద్ద చరిత్ర సృష్టించేందుకే అన్నాడీఎంకే, డీఎండీకే కూటమి అయ్యాయన్నారు. తాగునీరు, ఇంటి పన్నులు, విద్యుత్తు ఛార్జీలు పెంచేసిన డీఎంకే ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. బెల్‌ కంపెనీ నమ్ముకొని అనేక కుటుంబాలు జీవిస్తున్నాయని, దానిని ప్రైవేటీకరణ చేయడంతో చాలామంది ఉద్యోగవకాశాలు కోల్పోయారని చెపాపరు. అన్నాడీఎంకేను గెలిపిస్తే మళ్లీ ప్రభుత్వపరం చేసేలా తీసుకుంటామన్నారు. ఇందుకు కరుపయ్య పారమెంట్‌లో గళం వినిపిస్తారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని