logo

Vizag: పరుగులు పెట్టినా ఫలితం దక్కలే!.. ఒకే ప్లాట్‌ఫామ్‌పై రెండు వేర్వేరు రైళ్లు

తూ.కో రైల్వే విశాఖ రైలు నిలయంలో అధికారుల వింత చర్యలతో  ప్రయాణికులకు వెతలు తప్పడం లేదు. ప్లాట్‌ఫామ్‌ల కొరత నెపంతో విశాఖ నుంచి రెండు వేర్వేరు  ప్రాంతాలకు వెళ్లాల్సిన రైళ్లను ఒకే సమయంలో ఒక దాని వెనక మరొకటి

Updated : 24 May 2024 09:35 IST

రైలు నిలయంలో ప్రయాణికులకు వెతలు 

ఒక దాని వెనక ఒకటి ఆగి ఉన్న రైళ్లు

విశాఖ రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే: తూ.కో రైల్వే విశాఖ రైలు నిలయంలో అధికారుల వింత చర్యలతో  ప్రయాణికులకు వెతలు తప్పడం లేదు. ప్లాట్‌ఫామ్‌ల కొరత నెపంతో విశాఖ నుంచి రెండు వేర్వేరు  ప్రాంతాలకు వెళ్లాల్సిన రైళ్లను ఒకే సమయంలో ఒక దాని వెనక మరొకటి ఉంచడంతో ప్రయాణికులు గందరగోళానికి గురవుతున్నారు. ముందుగా వెళ్లాల్సిన విశాఖ- భువనేశ్వర్‌ ఇంటర్‌ సిటీ ఏడో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌కు ముందు వైపు ఉంచగా విశాఖ నుంచి దుర్గ్‌ వెళ్లాల్సిన రైలు బోగీలను దాని వెనుకనే నిలుపుతున్నారు. ఇంటర్‌ సిటీ రైలు సమాచారం ప్రకటనలో రైలు ముందు వైపు ఉందని ప్రకటిస్తున్నా వంతెన దిగిన వెంటనే కనిపిస్తున్న రైలు బోగీల్లోకి ప్రయాణికులు వెళ్లిపోతున్నారు. ఆ తర్వాత ప్రయాణించాల్సిన రైలు ఇది కాదని తెలుసుకొని పరుగులు తీయడం ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది తాము ఎక్కాల్సిన రైలు తప్పడంతో ఉసూరుమంటూ వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రెండు రైళ్లకు రద్దీ తీవ్రంగా ఉండటంతో పలువురు ప్రయాణికులు తికమక చెందాల్సిన దుస్థితి నెలకొంటోంది. నిత్యం ఇదే తంతు ఉన్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

వెళ్లిపోతున్న రైలు వెనక  పరుగులు తీస్తున్న ప్రయాణికులు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని