logo

డిమాండ్ల పరిష్కారం కోరుతూ నిరసన

విశాఖ గంగవరం పోర్టు నిర్వహక కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ విధుల భహిష్కరించి నిరసనకు దిగారు.

Updated : 13 Apr 2024 14:42 IST

గాజువాక: విశాఖ గంగవరం పోర్టు నిర్వహక కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ విధుల భహిష్కరించి నిరసనకు దిగారు. పోర్టు గేటు వద్ద బైఠాయించి నిరసన తెలియజేశారు. కనీస వేతం రూ. 36 వేలు చెల్లించాలని, విధి నిర్వహణలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాడంతో పాటు సూపర్ స్పెషాలిటీ ఆసుప్రతి సేవలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సందర్భంగా ఆంక్షలు ఉన్నాయని ఆందోళన చేయొద్దని పోలీసులు కోరారు. అయిన కార్మికలు గొడవకు దిగడంతో కొంత సమయంపాటు ఉద్రిక్తత చోటుచేసుకుంది. విశాఖ జోన్‌2 డీసీపీ సత్తిబాబు, పోర్టు పోలీసులు, కార్మికులు యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని