logo

ఈవీఎంలు వచ్చేశాయ్‌..

నియోజకవర్గ కేంద్రాలకు ఈవీఎంలు వచ్చేశాయి.. వాటిని నర్సీపట్నం ప్రభుత్వం డిగ్రీ కళాశాల, చోడవరం మండలం గాంధీ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పటిష్ఠ బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా మధ్య భద్రపరిచారు.

Published : 14 Apr 2024 03:55 IST

ఈవీఎం పెట్టెలను పరిశీలిస్తున్న రిటర్నింగ్‌ అధికారి జయరామ్‌

నర్సీపట్నం అర్బన్‌, చోడవరం, న్యూస్‌టుడే: నియోజకవర్గ కేంద్రాలకు ఈవీఎంలు వచ్చేశాయి.. వాటిని నర్సీపట్నం ప్రభుత్వం డిగ్రీ కళాశాల, చోడవరం మండలం గాంధీ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పటిష్ఠ బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా మధ్య భద్రపరిచారు. నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించి తొలివిడతగా శనివారం 340 వీవీ ప్యాట్స్‌, 314 బ్యాలెట్‌ యూనిట్లు, 314 కంట్రోల్‌ యూనిట్‌లు వచ్చాయి. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో అనకాపల్లి నుంచి కంటైనర్‌లో వీటిని తీసుకువచ్చారు. కంటెనర్‌ లోపలకు రావడానికి కళాశాల ముఖద్వారం బోర్డు అడ్డుగా ఉండటంతో దాన్ని తొలగించి వాహనాన్ని లోపలకు తీసుకువచ్చారు. తెదేపా, భాజపా, వైకాపా నాయకుల సమక్షంలో రిటర్నింగ్‌ అధికారి జయరామ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి శ్రీరాములు, సీఐ కాంతికుమార్‌ సీల్‌ తొలగించి పెట్టెలను గదిలో చేర్చారు. చోడవరం నియోజకవర్గానికి సంబంధించి 291 కంట్రోల్‌ యూనిట్లు, 291 బ్యాలెట్‌ యూనిట్లు, 315 వీవీ ప్యాట్స్‌ వచ్చాయని ఎన్నికల అధికారి చిన్నికృష్ణ చెప్పారు. తెదేపా, భాజపా, వైకాపా నాయకులు దేవరపల్లి సత్య, బొడ్డేడ గంగాధర్‌, అమర్‌, దొడ్డి వెంకట్‌ వీటిని పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని