logo

రూ.2.2 కోట్ల ఖర్చు.. నాణ్యత తీసికట్టు!

ఎలమంచిలి నియోజవర్గంలో రూ.కోట్లు ఖర్చుచేసి నిర్మించిన రోడ్లలో నాణ్యతకు తూట్లు పొడుస్తున్నారు. కొత్తగా వేసిన రోడ్లు నెలతిరక్క ముందే దెబ్బతింటున్నాయి. పర్యవేక్షణ లోపం, పనుల్లో నాణ్యత కొరవడడమే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Published : 14 Apr 2024 03:57 IST

నెల తిరక్కముందే దెబ్బతిన్న బైపాస్‌రోడ్డు
జగన్‌ పాలనలో రోడ్ల నిర్మాణం దుస్థితి

నారాయణపురం సమీపంలో దెబ్బతిన్న తారురోడ్డు

ఈనాడు అనకాపల్లి, ఎలమంచిలి న్యూస్‌టుడే: ఎలమంచిలి నియోజవర్గంలో రూ.కోట్లు ఖర్చుచేసి నిర్మించిన రోడ్లలో నాణ్యతకు తూట్లు పొడుస్తున్నారు. కొత్తగా వేసిన రోడ్లు నెలతిరక్క ముందే దెబ్బతింటున్నాయి. పర్యవేక్షణ లోపం, పనుల్లో నాణ్యత కొరవడడమే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

  • ఎలమంచిలి-అచ్యుతాపురం బైపాస్‌ రోడ్డు రూ.2.20 కోట్ల వ్యయంతో నెల రోజుల కిందట మరమ్మతులు చేపట్టారు. 20 రోజుల కిందట ఈ రోడ్డుపై కొత్తగా రోడ్డు వేశారు. గోతులతో ప్రయాణికులు పడుతున్న కష్టాలు తీరాయని సంతోషపడేలోగా తిరిగి రోడ్డు దెబ్బతింది. ఎలమంచిలి నుంచి మామిడివాడ వంతెన వరకు కొత్తగా తారు రోడ్డు వేశారు. బాగా దెబ్బతిన్న చోట రెండు లేయర్లు, మిగిలిన చోట ఒక లేయరు తారు రోడ్డు వేశారు. ఈ పనులు ఇటీవల పూర్తయ్యాయి. కొత్తగా వేసిన రోడ్డు నారాయణపురం సమీపంలో దెబ్బతింది. రోడ్డు తెగిపోయి ముందుకు జారిపోతోంది. ఈ రోడ్డుపై ద్విచక్ర వాహనాలు పార్కింగ్‌ చేస్తే రోడ్డు గొయ్యి పడుతోంది. నిర్మాణంలో నాణ్యతలోపం కారణంగానే ఇలా రోడ్డు దెబ్బతిందని వాహనచోదకులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దెబ్బతిన్న చోట మళ్లీ రోడ్డు పనులు చేపట్టాలని కోరుతున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని