logo

బోరు స్వాధీనం.. నీరు మళ్లింపు..!

అధికారుల అండదండలతో ఓ గుత్తేదారు సామాజిక బోరు(చేతిపంపు)ను దర్జాగా స్వాధీనం చేసుకుని నీటిని మళ్లిస్తున్నారు. ప్రజల దాహార్తి తీర్చాల్సిన బోరు నీటిని నిర్మాణ పనులకు వినియోగిస్తున్న తీరుపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Published : 14 Apr 2024 04:03 IST

చేతిపంపు హెడ్‌ తొలగించి.. ఏర్పాటు చేసిన పైపు

అగనంపూడి, న్యూస్‌టుడే: అధికారుల అండదండలతో ఓ గుత్తేదారు సామాజిక బోరు(చేతిపంపు)ను దర్జాగా స్వాధీనం చేసుకుని నీటిని మళ్లిస్తున్నారు. ప్రజల దాహార్తి తీర్చాల్సిన బోరు నీటిని నిర్మాణ పనులకు వినియోగిస్తున్న తీరుపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆ వివరాలు... అగనంపూడి సమీప 85వ వార్డు కొండయ్యవలస కాలనీలో సామాజిక భవన నిర్మాణానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఆరు నెలల కిందట శంకుస్థాపన చేసి, పనులను ఓ గుత్తేదారుకు అప్పగించారు. ఇటీవల పునాది పనులు చేపట్టిన గుత్తేదారు... పక్కనే రామాలయం వద్ద ఉన్న చేతిపంపును స్వాధీనం చేసుకున్నారు. పంపు పైభాగం తొలగించి, మోటారుతో కూడిన పైపును ఏర్పాటు చేసి... నిత్యం నీటిని తోడేస్తూ నిర్మాణ పనులకు వినియోగిస్తున్నారు. దీంతో కాలనీవాసులతో పాటు ఆలయానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

  • దీనిపై స్థానిక సచివాలయ ఎమినిటీస్‌ కార్యదర్శి శ్రావణి వివరణ కోరగా... బోరు స్వాధీనం విషయం తన దృష్టికి రాలేదని, పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని