logo

మేము మీతోనే ఉంటాం

‘కష్టాలను తీర్చేందుకు మీతోనే నేను ఉంటాను. రోజులో 24 గంటలు మా కార్యాలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఏ ఒక్కరికి సమస్య వచ్చినా.. మా సమస్యగా మేము మీతోనే ముందుండి ఆ సమస్యపై పోరాటం చేస్తామ’ని తెదేపా విశాఖ పార్లమెంటు అభ్యర్థి ఎం.వి.శ్రీభరత్‌ పేర్కొన్నారు.

Published : 14 Apr 2024 04:06 IST

శ్రీభరత్‌, విష్ణుకుమార్‌రాజు

ప్రచారంలో మాట్లాడుతున్న తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌, పక్కన విష్ణుకుమార్‌రాజు

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే: ‘కష్టాలను తీర్చేందుకు మీతోనే నేను ఉంటాను. రోజులో 24 గంటలు మా కార్యాలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఏ ఒక్కరికి సమస్య వచ్చినా.. మా సమస్యగా మేము మీతోనే ముందుండి ఆ సమస్యపై పోరాటం చేస్తామ’ని తెదేపా విశాఖ పార్లమెంటు అభ్యర్థి ఎం.వి.శ్రీభరత్‌ పేర్కొన్నారు. ఉత్తర నియోజకవర్గం కూటమి అభ్యర్థి పి.విష్ణుకుమార్‌రాజుతో కలసి ఆయన శనివారం 43వ వార్డులో ప్రచారం నిర్వహించారు. వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బొడ్డేటి మోహన్‌, శ్రీదేవి దంపతుల ఆధ్వర్యంలో అధికసంఖ్యలో తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీగా ప్రచారాన్ని చేపట్టారు. ముందుగా 200 కేజీల యాపిల్‌ పండ్లతో తయారు చేసిన గజమాలను విష్ణుకుమార్‌రాజుకు వేశారు. అక్కయ్యపాలెం మహారాణి పార్లర్‌ వద్ద ప్రారంభమై 80 అడుగుల రోడ్డు, శ్రీనివాసనగర్‌, నందగిరినగర్‌, చెక్కుడురాయి భవనం ప్రాంతాలలో ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైకాపా ఐదేళ్ల పాలనలో ఎక్కడా లేని అప్పులు తెచ్చి రాష్ట్ర అభివృద్ధిని జగన్‌ గాలికి వదిలేశాడన్నారు. రాష్ట్ర అవసరాల్ని తెలుసుకుని పరిష్కరించగలిగిన అనుభవజ్ఞుడు చంద్రబాబునాయుడు అని కొనియాడారు. కోలాటం, తప్పెటగుళ్లు, సేవ గరిడి, డప్పుల దరువులు, మేళతాళాలతో వైభవంగా ఊరేగింపు సాగింది. కార్యక్రమంలో తెదేపా, భాజపా, జనసేన నాయకులు బొడ్డేపల్లి రఘు, ఈతలపాక సుజాత, కొయిలాడ వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని