logo

అదానీ గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత

పెండింగ్‌లో ఉన్న డిమాండ్ల పరిష్కారం కోరుతూ నాలుగు రోజులుగా అదానీ గంగవరం పోర్టు నిర్వాసిత కార్మికులు చేపడుతున్న నిరసన శనివారం ఉద్రిక్తతకు దారి తీసింది.

Published : 14 Apr 2024 04:17 IST

విధులు బహిష్కరించిన కార్మికులు

నినాదాలు చేస్తున్న పోర్టు కార్మికులు

గాజువాక, న్యూస్‌టుడే : పెండింగ్‌లో ఉన్న డిమాండ్ల పరిష్కారం కోరుతూ నాలుగు రోజులుగా అదానీ గంగవరం పోర్టు నిర్వాసిత కార్మికులు చేపడుతున్న నిరసన శనివారం ఉద్రిక్తతకు దారి తీసింది. కార్మికులంతా విధులు బహిష్కరించి గేటు లోపల ఆందోళన చేశారు. ఆపరేషన్‌, మెకానికల్‌, టెక్నికల్‌ కార్మికులు సంఘీభావం ప్రకటించారు. విశాఖ పోర్టులో మాదిరిగా కార్మికులకు కనీస వేతనం రూ.36 వేలు చెల్లించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.అనంతరం యాజమాన్యం తీరుకు వ్యతిరేకంగా నినదించారు. ధర్నాలో పాల్గొన్న సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ... నిర్వాసిత కార్మికులకు చాలీచాలని వేతనాలు ఇస్తున్నారన్నారు. యూనియన్‌ నాయకులు కొవిరి అప్పలరాజు, ఎన్‌.తాతారావు, జి.అమ్మోరు, నూకరాజు, ఉమ్మిడి అప్పారావు, సత్యానందం, సత్తిబాబు మాట్లాడారు. విధి నిర్వహణలో మృతి చెందిన కార్మికులకు తగిన నష్టపరిహారం ప్రకటించాలన్నారు. ఆందోళనపై సమాచారం అందుకున్న జోన్‌-2 డీసీపీ సత్తిబాబు, ఏసీపీలు త్రినాథ్‌, మోసేజ్‌పాల్‌, నర్సింహమూర్తి, సునీల్‌, సీఐలు, సిబ్బంది చేరుకుని కార్మికులను వారించారు. కలెక్టరేట్లో చర్చలకు పిలుపు రావడంతో కార్మిక నాయకులు వెళ్లారు. పోర్టు వద్ద న్యూపోర్టు స్టేషన్‌ పోలీసులు బందోబస్తు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోర్టులోని కొన్ని నౌకల నుంచి దిగుమతి కార్యకలాపాలు నిలిచిపోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు