logo

తెదేపా అధ్యక్షునిగా తాతయ్యబాబు బాధ్యతల స్వీకరణ

తెదేపా జిల్లా అధ్యక్షునిగా బత్తుల తాతయ్యబాబు ఆదివారం అనకాపల్లిలోని పార్టీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

Published : 22 Apr 2024 03:22 IST

తాతయ్యబాబుతో బుద్ధ, చలపతిరావు

అనకాపల్లి, న్యూస్‌టుడే: తెదేపా జిల్లా అధ్యక్షునిగా బత్తుల తాతయ్యబాబు ఆదివారం అనకాపల్లిలోని పార్టీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ మాట్లాడుతూ అంకితభావంతో కష్టపడి పనిచేసే వారికి సరైన గుర్తింపు లభిస్తుందన్నారు. పనిచేసే వారికి పదవులు వాటంతటే అవే వస్తాయన్నారు. భవిష్యత్తులోనూ పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షులు బుద్ధ నాగజగదీశ్వరరావు నూకాలమ్మ చిత్రపటాన్ని  తాతయ్యబాబుకు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, మాజీ ఎమ్మెల్యేలు పీలా గోవిందసత్యనారాయణ, రామానాయుడు, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్‌, ఎలమంచిలి, మాడుగుల పార్టీ ఇన్‌ఛార్జులు ప్రగడ నాగేశ్వరరావు, పీవీజేె కుమార్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని