logo

నిబంధనలు మీరిన మద్యం దుకాణ సిబ్బందిపై వేటు

ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న, బెల్ట్‌ షాపులకు మద్యం సీసాలు సరఫరా చేసిన ప్రభుత్వ మద్యం దుకాణ సిబ్బంది ఇద్దరిపై వేటు పడింది.

Updated : 22 Apr 2024 05:46 IST

మాట్లాడుతున్న సీఎం రమేశ్‌

నర్సీపట్నం, న్యూస్‌టుడే: ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న, బెల్ట్‌ షాపులకు మద్యం సీసాలు సరఫరా చేసిన ప్రభుత్వ మద్యం దుకాణ సిబ్బంది ఇద్దరిపై వేటు పడింది. బలిఘట్టం, ఏటిగైరంపేటల్లోని మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న బి.రాంబాబు, ఆర్‌.హరీష్‌ వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అనకాపల్లి ఎక్సైజ్‌ అధికారులకు ఫిర్యాదులు అందాయి. వీరిద్దరిపై నిఘా ఉంచి విచారణ చేపట్టారు. బలిఘట్టం దుకాణ సిబ్బంది బి.రాంబాబు బెల్ట్‌షాపులకు మద్యం సీసాలు సరఫరా చేశాడని, ఏటిగైరంపేట దుకాణ సిబ్బంది ఆర్‌.హరీష్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు తేలింది. ఈ మేరకు నివేదిక ఇవ్వగా ఇద్దర్నీ ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని