logo

రంగంలోకి పసుపు దళం

 అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో కూటమి తరఫున అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న తెదేపా అభ్యర్థులు అధినేత చంద్రబాబునాయుడు చేతులమీదుగా మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో ఆదివారం బీఫారాలు అందుకున్నారు.

Published : 22 Apr 2024 03:24 IST

 ఫాంలు అందించిన చంద్రబాబు 

తదితరులు పాల్గొన్నారు.చంద్రబాబుతో రాజు, బండారు, అయ్యన్న, అనిత

చోడవరం, కె.కోటపాడు, న్యూస్‌టుడే:  అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో కూటమి తరఫున అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న తెదేపా అభ్యర్థులు అధినేత చంద్రబాబునాయుడు చేతులమీదుగా మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో ఆదివారం బీఫారాలు అందుకున్నారు. వీరిలో మాజీ మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు (నర్సీపట్నం), బండారు సత్యనారాయణమూర్తి (మాడుగుల), కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు (చోడవరం), వంగలపూడి అనిత (పాయకరావుపేట) ఉన్నారు. చోడవరం నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా కేఎస్‌ఎస్‌ఎన్‌ రాజు నాలుగోసారి పోటీ చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ నెల 25న కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి మరో సెట్‌ నామినేషన్‌ దాఖలు చేస్తారని పార్టీ కార్యాలయ వర్గాలు తెలిపాయి.

నక్కపల్లి, న్యూస్‌టుడే: కూటమి తరఫున ‘పేట’ అభ్యర్థిగా తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత సోమవారం నామినేషన్‌ వేయనున్నారు. ఉదయం తన నివాసం నుంచి నాలుగు మండలాలకు చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ర్యాలీ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌, జిల్లా అధ్యక్షుడు తాతయ్యబాబు తదితరులు హాజరుకానున్నారు. మరోవైపు వైకాపా అభ్యర్థి కంబాల జోగులు సైతం నేడే నామినేషన్‌ వేస్తున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.  

పాడేరు, చింతపల్లి, న్యూస్‌టుడే: పాడేరు కూటమి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి అవకాశం దక్కింది. చంద్రబాబు చేతులమీదుగా ఆమె బీ-ఫాం అందుకున్నారు. నియోజకవర్గంలో ఈమెకు బలమైన క్యాడర్‌ ఉంది. గత అయిదేళ్లుగా పార్టీ బలోపేతానికి పనిచేశారు. పాడేరు అసెంబ్లీ సీటును తొలుత కిల్లు వెంకట రమేష్‌నాయుడికి అధిష్ఠానం కేటాయించింది. రెబల్‌ అభ్యర్థిగా పోటీచేస్తానని ప్రకటించారు. అనూహ్య పరిణామాలతో మళ్లీ ఈశ్వరికి టికెట్‌ ఇచ్చింది.

యువతకు 20 లక్షల ఉద్యోగాలిస్తాం

కశింకోట, న్యూస్‌టుడే: యువత, మహిళలను మోసగించిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. బయ్యవరం, రామన్నపాలెం గ్రామాలలో ఉపాధి హామీ కూలీలతో ఆదివారం సమావేశమయ్యారు. వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి అధికారం అప్పగిస్తే యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.  గ్లాసు, కమలం గుర్తులపై ఓటు వేసి సీఎం.రమేష్‌, కొణతాల రామకృష్ణను గెలిపించాలని కోరారు. సీఎం రమేశ్‌ కుమారుడు రిత్విÚ్, నాయకులు కాయల మురళీధర్‌, ఉగ్గిన రమణమూర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని