logo

‘జగన్‌ మాటలకు జనం నవ్వుకుంటున్నారు’

విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేస్తామని ఇక్కడి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు, ప్రకృతి వనరులు దోచుకొని జగన్‌ బాబా టీం విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, ఎం.వి.వి.సత్యనారాయణ ఒక్క విశాఖలోనే రూ.30వేలు కోట్ల ఆస్తులను కొల్లగొట్టారని జనసేన నాయకులు పీతల మూర్తి యాదవ్‌ ఆరోపించారు.

Published : 22 Apr 2024 03:31 IST

విలేకరులతో మాట్లాడుతున్న పీతల మూర్తి యాదవ్‌, పీవీఎస్‌ఎన్‌ రాజు

సీతంపేట, న్యూస్‌టుడే : విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేస్తామని ఇక్కడి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు, ప్రకృతి వనరులు దోచుకొని జగన్‌ బాబా టీం విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, ఎం.వి.వి.సత్యనారాయణ ఒక్క విశాఖలోనే రూ.30వేలు కోట్ల ఆస్తులను కొల్లగొట్టారని జనసేన నాయకులు పీతల మూర్తి యాదవ్‌ ఆరోపించారు. ఆయన విశాఖ పౌరగ్రంథాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. జగన్‌ మోహన్‌ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖలో సుమారు రూ.15వందల కోట్ల విలువచేసే పనులకు శంకుస్థాపనలు చేసి రూ.150కోట్ల పనులైనా పూర్తి చేయలేకపోయారన్నారు. రుషికొండను బోడి కొండను చేసి విలాసవంతమైన భవనం తప్ప పరిపాలనా రాజధాని చేస్తామన్న విశాఖకు ఒక్క ఇటుక వెయ్యలేదని ఆరోపించారు. బస్సుయాత్రలో ముఖ్యమంత్రి ఆడుతున్న మాటలు విని ప్రజలు నవ్విపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. అక్రమ మద్యంతో వేల మంది అమాయక ప్రజల ప్రాణాలు తీసిన ముఖ్యమంత్రి జగన్‌ పేదల గుండెల్లో గూడు కట్టుకొని ఉంటానని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కార్యక్రమంలో జనసేన చోడవరం ఇంఛార్జి పీవీఎస్‌ఎన్‌ రాజు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని