logo

యాదవ సామాజిక వర్గాన్ని జగన్‌ వంచించారు: వంశీకృష్ణ

ఉత్తరాంధ్ర జిల్లాల్లో అధిక సంఖ్యలో ఉన్న యాదవులకు జగన్‌ ఒక్క ఎమ్మెల్యే సీటు ఇవ్వకుండా వంచించారని దక్షిణ నియోజకవర్గ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్‌ విమర్శించారు.

Published : 22 Apr 2024 03:32 IST

మాట్లాడుతున్న వంశీకృష్ణ శ్రీనివాస్‌'

జ్ఞానాపురం, న్యూస్‌టుడే: ఉత్తరాంధ్ర జిల్లాల్లో అధిక సంఖ్యలో ఉన్న యాదవులకు జగన్‌ ఒక్క ఎమ్మెల్యే సీటు ఇవ్వకుండా వంచించారని దక్షిణ నియోజకవర్గ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్‌ విమర్శించారు. జ్ఞానాపురంలోని యాదవ సామాజిక వర్గీయులు వంశీకృష్ణ శ్రీనివాస్‌కు మద్దతుగా ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ జగన్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదన్నారు. తనకు కాకుండా మరొకరికి మేయర్‌ పదవి ఇచ్చారన్నారు. అక్రమాని విజయనిర్మలకు ఎమ్మెల్యే సీటు ఇస్తానని చెప్పి మొండి చెయ్యి చూపారన్నారు. తెదేపా, జనసేన అధినేతలు చంద్రబాబునాయుడు, పవన్‌ కల్యాణ్‌ యాదవులకు పెద్దపీట వేశారన్నారు. ఎంత ఒత్తిడి వచ్చినా ఇచ్చిన మాట ప్రకారం దక్షిణంలో జనసేన తరఫున తనకు, గాజువాకలో తెదేపా తరఫున పల్లా శ్రీనివాసరావుకు సీట్లు కేటాయించారన్నారు. యాదవ సంఘం నాయకుడు ఐతి రవిబాబు మాట్లాడుతూ 20 ఏళ్ల తరువాత దక్షిణం నియోజవర్గాన్ని యాదవులకు కేటాయించిన తెదేపా, జనసేన, భాజపా కూటమికి కృతజ్ఞతలు తెలిపారు. సంఘం పెద్దలు నంబారు శంకరరావు, నొడగల ఆనందరావు, పాత్రపల్లి జోజిబాబు, దాలిబాని ప్రసాద్‌, కర్రి భానోజీరావు, ఐతి మధుబాబు, గారి ఆంథోని తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని