logo

అధ్యాపకుల సేవలు అభినందనీయం

సబ్బవరం గురుకుల కళాశాలలో ఎక్కువ కాలం పని చేసి పదవీ విరమణ చేసిన అధ్యాకులు జాన అప్పారావు, బద్రికూర్మారావుల సేవలు చిరస్మరణీయమని జిల్లా సమన్వయ అధికారి (డీసీవో) రూపవతి అన్నారు.

Published : 23 Apr 2024 04:23 IST

మాట్లాడుతున్న జిల్లా సమన్వయ అధికారి (డీసీవో) రూపవతి

సబ్బవరం న్యూస్‌టుడే: సబ్బవరం గురుకుల కళాశాలలో ఎక్కువ కాలం పని చేసి పదవీ విరమణ చేసిన అధ్యాకులు జాన అప్పారావు, బద్రికూర్మారావుల సేవలు చిరస్మరణీయమని జిల్లా సమన్వయ అధికారి (డీసీవో) రూపవతి అన్నారు. కళాశాల అధ్యాపకులు తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వారు అందించిన సేవలను కొనియాడారు. వక్తలు మల్లేశ్వరరావు, సత్యారావు, విజయ్‌కుమార్‌, బుచ్చిరాజు, సన్యాసినాయుడు శివ ప్రసాద్‌, అప్పారావు తదితరులు మాట్లాడారు. అనంతరం వారిద్దరినీ సన్మానించి జ్ఞాపికలు అందించారు. గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు