logo

కలెక్టరేట్‌లోకి వెళ్లకుండా వెలగపూడి అడ్డగింత

తెదేపా విశాఖ ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్‌ నామపత్రాల దాఖలు సందర్భంగా కలెక్టరేట్‌ ప్రవేశద్వారం వద్ద ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును పోలీసులు అడ్డుకోవడం వివాదాస్పదమైంది.

Published : 23 Apr 2024 04:29 IST

పోలీసు అధికారితో వెలగపూడి వాగ్వాదం

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: తెదేపా విశాఖ ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్‌ నామపత్రాల దాఖలు సందర్భంగా కలెక్టరేట్‌ ప్రవేశద్వారం వద్ద ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును పోలీసులు అడ్డుకోవడం వివాదాస్పదమైంది. తెదేపా అభ్యర్థులుగా శ్రీభరత్‌, తేజస్విని సోమవారం ఉదయం కలెక్టరేట్‌లో నామపత్రాలు దాఖలు చేశారు. ఇద్దరి తరఫున 10మంది లోపలికి అనుమతించేందుకు అవకాశం ఉంది. జాబితాలో వెలగపూడి పేరు ఉంది. తొలుత 9 మంది నాయకులు లోపలికి వెళ్లారు. మండుటెండలో రావడంతో అలసటకు గురైన వెలగపూడి కొద్దిసేపు సేదతీరి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారి అడ్డుకున్నారు. ఇప్పటికే 10మంది వెళ్లారని, నిబంధనల ప్రకారం మరొకరు వెళ్లడానికి వీల్లేదని చెప్పారు. దీంతో వెలగపూడి తీవ్ర అసహనానికి గురయ్యారు. 9 మందే లోపలికి వెళ్లారని, తాను వెళతానని పట్టుబట్టారు. సదరు పోలీసు అధికారి అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. పోలీసు అధికారులు ఇప్పటికీ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను లోపలికి వెళ్లి అక్కడన్న వారిలో ఒకరిని వెనక్కి పంపుతానని వెలగపూడి చెప్పడంతో పోలీసు అధికారి శాంతించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు