logo

యువతా.. ఓటుకు తరలిరండి..

సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ (సీబీసీ) ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఓటరు అవగాహన సదస్సుకు స్పందన లభించింది.

Published : 24 Apr 2024 04:35 IST

విజేతలకు బహుమతులు అందజేస్తున్న సీబీసీ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ రాజీంద్ర చౌదరి

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ (సీబీసీ) ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఓటరు అవగాహన సదస్సుకు స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో విద్యార్థినులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది హాజరయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యవస్థీకృత ఓటర్ల విద్య, ఓటర్ల భాగస్వామ్య కార్యక్రమం (స్వీప్‌)లో భాగంగా ఈ సదస్సు ఏర్పాటు చేశారు. సీబీసీ రాష్ట్ర అదనపు డైరెక్టర్‌ జనరల్‌ రాజీంద్ర చౌదరి మాట్లాడుతూ ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. సాంఘిక సంక్షేమశాఖ డీడీ రామారావు, సీబీసీ సహాయ సంచాలకులు షఫీ మహమ్మద్‌, కళాశాల ఉప ప్రిన్సిపల్‌ వై.లక్ష్మి, స్వీప్‌ సభ్యులు  పాల్గొని పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని