logo

కేజీహెచ్‌కు డెంగీ కేసుల తాకిడి

కేజీహెచ్‌కు డెంగీ కేసుల తాకిడి పెరిగింది. ఇటీవల కురిసిన వర్షాలతో వాతావరణంలో మార్పు వచ్చింది. డెంగీ దోమలు విజృంభిస్తున్నాయి. తీవ్రమైన జ్వరం, ఒళ్లు, తలనొప్పి వంటి వాటితో బాధపడుతూ చికిత్స కోసం కేజీహెచ్‌కు వచ్చే బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

Published : 20 May 2024 03:40 IST

చికిత్స పొందుతున్న యువకుడు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: కేజీహెచ్‌కు డెంగీ కేసుల తాకిడి పెరిగింది. ఇటీవల కురిసిన వర్షాలతో వాతావరణంలో మార్పు వచ్చింది. డెంగీ దోమలు విజృంభిస్తున్నాయి. తీవ్రమైన జ్వరం, ఒళ్లు, తలనొప్పి వంటి వాటితో బాధపడుతూ చికిత్స కోసం కేజీహెచ్‌కు వచ్చే బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తీవ్రమైన ఇబ్బందులున్న వారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. గత నాలుగైదు రోజుల్లో నలుగురు బాధితులు డెంగీతో కేజీహెచ్‌లో చేరారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో పలువురు జ్వరంతో చేరుతున్నారు. రానున్న రోజుల్లో కూడా వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జీవీఎంసీ యంత్రాంగం అప్రమత్తం కావాల్సి ఉంది. వర్షపు నీరు నిల్వ లేకుండా చర్యలు చేపట్టాలి. కేజీహెచ్‌లో డెంగీ కోసం ప్రత్యేకంగా వార్డు ఉందని, అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. డెంగీ ప్రబలుతున్న నేపథ్యంలో యంత్రాంగం తగు జాగ్రత్తలు తీసుకోవాలని భాజపా వైద్య విభాగ కన్వీనరు ఆర్‌.రవికుమార్‌ కోరారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని