logo

ఎన్నికల నేపథ్యంలో రెండు నెలలు.. రూ.కోట్ల సొత్తు స్వాధీనం

ఎన్నికల పేరు చెబితే అందరికీ గుర్తుకు వచ్చేది రాజకీయ నాయకుల ప్రచారాలు, ప్రలోభాలు. ఇందుల్లో ప్రలోభాలకు అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లాలో రెండు నెలలపాటు ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టులు, ఇతర ప్రదేశాల్లో చేసిన తనిఖీల ద్వారా అధికారులు వందల కొద్ది కేసులు పెట్టి, రూ. కోట్ల విలువైన సొత్తు పట్టుకున్నారు.

Published : 20 May 2024 04:09 IST

పాడేరు, నక్కపల్లి, న్యూస్‌టుడే

కాగిత వద్ద పట్టుకున్న భారీ నగదు చూపుతున్న పోలీసులు

నక్కపల్లి, న్యూస్‌టుడే: ఎన్నికల పేరు చెబితే అందరికీ గుర్తుకు వచ్చేది రాజకీయ నాయకుల ప్రచారాలు, ప్రలోభాలు. ఇందుల్లో ప్రలోభాలకు అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లాలో రెండు నెలలపాటు ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టులు, ఇతర ప్రదేశాల్లో చేసిన తనిఖీల ద్వారా అధికారులు వందల కొద్ది కేసులు పెట్టి, రూ. కోట్ల విలువైన సొత్తు పట్టుకున్నారు.

ఎన్నికల కోడ్‌ అమలులోకి రాక ముందు నుంచే నక్కపల్లి మండలం కాగిత వద్ద చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. మిగతా అన్ని చోట్లా విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎటువంటి ఆధారాలు, అనుమతులు లేకుండా అక్రమంగా తరలించే నగదు, మద్యం, గంజాయి తదితర వాటిని పట్టుకున్నారు. జిల్లాలో చెక్‌పోస్టుల పనితీరును కలెక్టర్‌ రవి, ఎస్పీ మురళీకృష్ణ పలుమార్లు తనిఖీ చేయడంతోపాటు సిబ్బందికి సూచనలిచ్చారు. ఈ తనిఖీల్లో భాగంగా 1040 కేసులు నమోదు చేసి, 1273 మందిని కటకటాల్లోకి పంపారు. దాదాపు రూ. 3.89 కోట్ల విలువైన సొత్తు పట్టుకున్నారు. కాగిత టోల్‌గేట్‌ వద్ద తనిఖీల ద్వారా పోలీసులు రూ.2.07 కోట్ల నగదు పట్టుకున్నారు. దీనికి ఏ ఆధారాలు లేకపోవడంతో సీజ్‌ చేశారు. ఈ రెండు నెలల్లో పట్టుకున్న దానికి ఇది అదనం. ఎలమంచిలి మండలం సోమలింగంపాలెం వద్ద గడ్డివాములో దాచిన రూ. 49 లక్షలకుపైగా విలువైన 39 వేల పైచిలుకు మద్యం సీసాలను పట్టుకున్నారు. దీనికి తోడు వివిధ ప్రాంతాల్లో గంజాయి, మద్యం, ప్రలోభాలకు గురి చేసే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

ఎలమంచిలి మండలం సోమలింగపాలెం వద్ద గడ్డివాములో దాచిన మద్యం సీసాలను స్వాధీనం చేసుకుంటున్న పోలీసులు

తనిఖీల ముఖచిత్రం

  • చెక్‌పోస్టులు: 29
  • నాటుసారా, పులుపు: 215 కేసులు, 1.28లక్షల లీటర్లు, విలువ రూ. 88.71 లక్షలు, 99 మంది అరెస్టు
  • మద్యం: 669 కేసులు, 9833 లీటర్లు, రూ. 78.14 లక్షల విలువ, 679 మంది అరెస్టు
  • గంజాయి: 21 కేసులు, 1186 కేజీలు, రూ. 64.49 లక్షల విలువ, 41 మంది అరెస్టు
  • జూదం: 105 కేసులు, నగదు రూ. 12.75 లక్షలు, 454 మంది అరెస్టు
  • నగదు: 19 కేసులు, రూ. 1,18,95,780
  • ప్రలోభాలు: 11 కేసులు, రూ. 19.73 లక్షల విలువ
  • బీ బంగారం (9.83 గ్రాములు), వెండి (7.31కేజీలు): 1 కేసు, రూ. 7.06 లక్షలు
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని