logo

‘చంద్రబాబే ముఖ్యమంత్రి!.. ఫలితాల తర్వాత వైకాపా కాలగర్భంలోకి..’

తెదేపా అధినేత చంద్రబాబునాయుడే కాబోయే ముఖ్యమంత్రి అని ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు.

Published : 22 May 2024 05:19 IST

ఎంపీ రఘురామ కృష్ణరాజు

కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎంపీ రఘురామ కృష్ణరాజు.. చిత్రంలో ఉత్తరం నియోజకవర్గ
భాజపా అభ్యర్థి పి.విష్ణుకుమార్‌రాజు, ఎమ్మెల్సీ రఘువర్మ తదితరులు

గురుద్వారా, న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబునాయుడే కాబోయే ముఖ్యమంత్రి అని ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. మంగళవారం విశాఖ నగరానికి విచ్చేసిన ఆయన  సీతమ్మధార కేఎస్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జూన్‌ 4వ తేదీన వైకాపా నాయకులు కనబడరని జోస్యం చెప్పారు. దేవుడు అతి తీవ్రంగా కరుణిస్తే ఆ పార్టీకి 50 సీట్లు.. లేకుంటే 25 మాత్రమే వస్తాయని తెలియజేశారు. తాను ఎంపీగా పోటీ చేయాలనుకున్నానని, దేవుడు తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చారన్నారు. ఉండి నియోజకవర్గంలో 30 వేల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తంచేశారు. జగన్‌ జనవరిలో బటన్‌ నొక్కితే ఇప్పటికీ డబ్బులు పడలేదని, అవి ఎక్కడికి వెళ్లాయో అతనికే తెలియాలని ఆరోపించారు. జూన్‌ 4వ తేదీన వైకాపా కాలగర్భంలోకి కలిసిపోతుందని, ఆరోజు మధ్యాహ్నం నుంచి ఆ పార్టీ నాయకులకు అల్లర్లు చేయడానికి ఓపిక ఉండదని పేర్కొన్నారు.  పోలీసు ఉన్నతాధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై కావాలనే కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని.. చీఫ్‌ సెక్రటరీని సస్పెండ్‌ చేస్తే బాగుండేదని విమర్శించారు. తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రుషికొండ నిర్మాణాలపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. జగన్‌ సభలకు వచ్చిన వారంతా అభిమానం మీద రాలేదని బలవంతంగా తీసుకొచ్చారని విమర్శించారు. సమావేశంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం భాజపా అభ్యర్థి పి.విష్ణుకుమార్‌రాజు, ఎమ్మెల్సీ రఘువర్మ, తెదేపా ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త ఎండీ నజీర్, భాజపా నాయకులు పరశురామరాజు, సురేశ్‌బాబు, పృధ్వీరాజ్, ఆళ్ల శ్రీనివాస్, పీస్‌ఎన్‌ రాజు, బుద్ధరాజు శివాజీ, పలువురు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు