logo

మీడియా కేంద్రంలో తాజా సమాచారం

ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల ఆవరణలోని ఓట్ల లెక్కింపు కేంద్రంలో మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ ఎ.మల్లికార్జున తెలిపారు.

Published : 23 May 2024 05:30 IST

వన్‌టౌన్, ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల ఆవరణలోని ఓట్ల లెక్కింపు కేంద్రంలో మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ ఎ.మల్లికార్జున తెలిపారు. కౌంటింగ్‌ ఫలితాల తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియాకు చేరవేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ అధికారిని ఆదేశించారు. బుధవారం సాయంత్రం జాయింట్‌ పోలీసు కమిషనర్‌ ఫకీరప్ప, జేసీ మయూర్‌ అశోక్, అధికారులతో కలిసి కలెక్టర్‌ స్ట్రాంగ్‌ రూమ్‌ను పరిశీలించి, భద్రతా ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ప్రతి గదికి వేసిన తాళాలు, సీళ్లను పరిశీలించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని