logo

పలు రైళ్లకు ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు..

ప్రయాణికుల సౌకర్యార్థం పలు రైళ్లకు ఎల్‌హెచ్‌బీ బోగీలను ఏర్పాటు చేయనున్నట్లు వాల్తేరు సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలిపారు.

Published : 23 May 2024 05:38 IST

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే: ప్రయాణికుల సౌకర్యార్థం పలు రైళ్లకు ఎల్‌హెచ్‌బీ బోగీలను ఏర్పాటు చేయనున్నట్లు వాల్తేరు సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలిపారు. ఈనెల 24 నుంచి విశాఖ-చెన్నై సెంట్రల్‌ (22801) వీక్లి, 25 నుంచి చెన్నై సెంట్రల్‌-విశాఖ (22802) వీక్లి, 26 నుంచి విశాఖ-పారాదీప్‌(22810) వీక్లి, 27 నుంచి పారాదీప్‌-విశాఖ (22809) వీక్లి ఎక్స్‌ప్రెస్‌లు, 28 నుంచి విశాఖ-కర్నూల్‌ టౌన్‌ (08585) వేసవి ప్రత్యేక రైలు, 29 నుంచి కర్నూల్‌ టౌన్‌-విశాఖ (08586) వేసవి ప్రత్యేక రైళ్లు ఎల్‌హెచ్‌బీ బోగీలతో నడుస్తాయన్నారు. 2 సెకండ్‌ ఏసీ, మూడు థర్డ్‌ ఏసీ, 9 స్లీపర్, 4 జనరల్‌ సెకండ్‌ క్లాస్, ఒక సెకండ్‌ క్లాస్‌ సిటింగ్‌ కమ్‌ లగేజీ/ దివ్యాంగజన్‌ కోచ్, ఒక జనరేటర్‌ మోటార్‌ కార్‌తో ఆయా రైళ్లు రాకపోకలు సాగిస్తాయని పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని