logo

జీవవైవిధ్య పరిరక్షణకు సమష్టి కృషి అవసరం

సమాజంలో అన్ని వర్గాల భాగస్వామ్యం, ప్రజల సమష్టి కృషి వల్లే జీవ వైవిధ్య పరిరక్షణ సాధ్యమవుతుందని.. 2030 నాటికి అన్నిరంగాలకు సుస్థిరమైన పర్యావరణాభివృద్ధి ఫలాలు అందుతాయని ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు చిరంజీవి చౌదరి పేర్కొన్నారు.

Published : 23 May 2024 05:58 IST

విభిన్న సీతాకోక చిలుకలు 

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే : సమాజంలో అన్ని వర్గాల భాగస్వామ్యం, ప్రజల సమష్టి కృషి వల్లే జీవ వైవిధ్య పరిరక్షణ సాధ్యమవుతుందని.. 2030 నాటికి అన్నిరంగాలకు సుస్థిరమైన పర్యావరణాభివృద్ధి ఫలాలు అందుతాయని ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు చిరంజీవి చౌదరి పేర్కొన్నారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ హాలులో బుధవారం నిర్వహించిన జాతీయ స్థాయి జీవ వైవిధ్య దినోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సుస్థిర పద్ధతిలో ప్రయోజనాలు అందించేందుకు, జీవ వైవిధ్య పరిరక్షణ లక్ష్యాలను సాధించేందుకు ప్రణాళికాయుత చర్యలతో ముందుకువెళుతోందని అన్నారు. ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి మాట్లాడుతూ.. రాబోవు 50 ఏళ్లలో సమాజంలోని అన్ని రంగాల, వర్గాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏయూ ప్రధాన కేంద్రంగా బయోడైవర్సిటీ పార్కును నెలకొల్పుతున్నా మన్నారు. కార్యక్రమంలో ఏపీ స్టేట్‌ బయోడైవర్సిటీ బోర్డు మెంబర్‌ సెక్రటరీ బీవీఏ కృష్ణమూర్తి, విశాఖపట్నం జిల్లా చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు ఎస్‌.శ్రీకాంత్‌నాథ్‌ రెడ్డి, జాతీయ బయోడైవర్సిటీ అథారిటి ప్రతినిధి ఆచార్య హంచినల్‌ రాయప్ప రామప్ప, వై.ఎస్‌.ఆర్‌. హార్టీకల్చర్‌ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య టి.జానకీరామ్, పలువురు అధికారులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జీవవైవిధ్యంపై రాసిన పుస్తకాలను ఆవిష్కరించారు.
అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా వివిధ జీవుల ఆకృతుల ప్రదర్శన ఆకట్టుకుంది. జీవ వైవిధ్యాన్ని ఇవి కళ్లకు కట్టాయి. ప్రకృతి వనరులకు ముప్పు ఏర్పడితే జీవులకు కలిగే నష్టాన్ని ఈ ప్రదర్శనల ద్వారా వివరించారు.
ఈనాడు, విశాఖపట్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని