logo

ట్రాయ్‌ పేరిట సైబర్‌ వల

సైబర్‌ మోసగాళ్లు ట్రాయ్‌ పేరిట పలువురికి ఫోన్లు చేసి బెదిరింపులకు దిగి, వారి నుంచి దొరికినంత దోచేస్తున్నారని, ఈ తరహా ఫోన్లపట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Published : 24 May 2024 03:53 IST

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : సైబర్‌ మోసగాళ్లు ట్రాయ్‌ పేరిట పలువురికి ఫోన్లు చేసి బెదిరింపులకు దిగి, వారి నుంచి దొరికినంత దోచేస్తున్నారని, ఈ తరహా ఫోన్లపట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. టెలిఫోన్‌ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) కాల్‌సెంటర్‌ నుంచి మాట్లాడుతున్నట్లు పలువురికి ఫోన్లు చేసి ‘మీరు వినియోగిస్తున్న ఫోన్‌నెంబరు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వాడుతున్నట్లు గుర్తించాం. మీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది’ అని బెదిరింపులకు దిగుతున్నారన్నారు. తర్వాత వీడియో కాల్‌లో ఒక నకిలీ పోలీసుతో మాట్లాడించి.. అరెస్టు నిరోధించడానికి కొంత మొత్తం బదిలీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారన్నారు. ఆ తర్వాత బాధితుని వివరాలను సేకరించి, వారి ఖాతా నుంచి దొరికినంత దోచేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఈ తరహా ఫోన్లు వస్తే వెంటనే 1930కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని