logo

అడుగంటిన ఏలేరు జలాశయం

విశాఖ ఉక్కు కర్మాగార నీటి అవసరాలకు, కాకినాడ జిల్లా మెట్ట ప్రాంత సాగునీటికి ఆధారమైన ఏలేరు జలాశయంలో నీటి నిల్వలు అడుగంటాయి. జూన్‌లో విశాఖ ఏజెన్సీలో సకాలంలో వర్షాలు పడితేనే జలాశయం నిండుతుంది.

Published : 24 May 2024 03:56 IST

విశాఖకు ఎత్తిపోతలతో నీరు

విశాఖ అవసరాలకు మోటార్లతో ఎత్తిపోసి తరలిస్తున్న నీరు 

ఏలేశ్వరం, న్యూస్‌టుడే: విశాఖ ఉక్కు కర్మాగార నీటి అవసరాలకు, కాకినాడ జిల్లా మెట్ట ప్రాంత సాగునీటికి ఆధారమైన ఏలేరు జలాశయంలో నీటి నిల్వలు అడుగంటాయి. జూన్‌లో విశాఖ ఏజెన్సీలో సకాలంలో వర్షాలు పడితేనే జలాశయం నిండుతుంది. ఏలేరు జలాశయానికి 24.11 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ప్రస్తుతం 3.74 టీఎంసీల నీరే ఉంది. ఇక్కడి నుంచి 53 వేల ఎకరాలకు సాగు నీటిని అందించాలి. విశాఖ ఉక్కు కర్మాగారానికి, మహా నగర తాగునీటి అవసరాలకూ నీరందించాలి. వ్యవసాయం, విశాఖ నగరానికి 18 టీఎంసీల జలాలను వినియోగిస్తారు. మిగిలిన ఆరు టీఎంసీలను డెడ్‌ స్టోరేజీగా నిల్వ ఉంచాలి. ఇప్పుడదీ అడుగంటింది. ఈ ప్రతికూల పరిస్థితుల్లో విశాఖకు సాధారణ స్లూయిస్‌ నుంచి నీరు వెళ్లడం అసాధ్యం. అందుకే మోటార్లను ఏర్పాటు చేసి పంపుల ద్వారా కనిష్ఠ నిల్వల నుంచే నీటిని విశాఖ వెళ్లే ఏలేరు ఎడమ ప్రధాన కాలువలో తోడి పోస్తున్నారు. ప్రస్తుతం పైపుల సాయంతో 130 క్యూసెక్కుల నీరు జీవీఎంసీకి సరఫరా చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు