logo

సైబర్‌ నేరగాళ్ల నుంచి ఎట్టకేలకు విముక్తి

ఉద్యోగాల పేరుతో యువతను మోసగించి... వారిని అష్టకష్టాలపాల్జేసి... సైబర్‌ నేరాలు చేయించే కాంబోడియాలోని ముఠాల బారి నుంచి పలువురు ఎట్టకేలకు బయటపడ్డారు.

Published : 24 May 2024 03:58 IST

కాంబోడియా నుంచి భారత్‌కు 60 మంది
ఫలించిన రాయబార కార్యాలయ అధికారుల కృషి

కాంబోడియా నుంచి భారత్‌కు బయలుదేరిన బృందంలోని యువకులు

గోపాలపట్నం, ఎంవీపీ కాలనీ, న్యూస్‌టుడే: ఉద్యోగాల పేరుతో యువతను మోసగించి... వారిని అష్టకష్టాలపాల్జేసి... సైబర్‌ నేరాలు చేయించే కాంబోడియాలోని ముఠాల బారి నుంచి పలువురు ఎట్టకేలకు బయటపడ్డారు. భారత్‌ యువకులు కాంబోడియాలోని చైనా దేశీయుల ఉచ్చులో చిక్కి నరక యాతన అనుభవిస్తున్నారని ఇటీవల విశాఖ సీపీ రవిశంకర్‌ వెల్లడించారు. ఆ నేరగాళ్ల బారి నుంచి తప్పించుకొచ్చిన విశాఖ వాసి ఒకరు ఇచ్చిన సమాచారంతో దారుణ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. విశాఖకు చెందిన దాదాపు 150 మంది, దేశ వ్యాప్తంగా దాదాపు ఐదు వేల మంది కాంబోడియాలో మోసగాళ్ల బారినపడినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయానికి విశాఖ సీపీ సమాచారమిచ్చారు. దీంతో స్థానిక అధికారులతో సంప్రదింపులు కొంత ఫలితమిచ్చాయి. అలాగే...కొద్ది రోజుల కిందట పెద్ద సంఖ్యలో యువకులు ముఠాలకు వ్యతిరేకంగా కాంబోడియాలో ఆందోళనకు దిగగా... కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో దాదాపు 60 మంది తొలివిడతగా రాయబార కార్యాలయ అధికారుల కృషితో గురువారం భారత్‌కు బయలుదేరినట్లు విశాఖ పోలీసులకు  సమాచారం అందింది. ఈ విషయం తెలిసిన యువకుల కుటుంబ సభ్యులు వారి రాక కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు