logo

కౌంటింగ్‌ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ ఎ.మల్లికార్జున వెల్లడించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మూడంచెల భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నామని పేర్కొన్నారు.

Published : 24 May 2024 04:37 IST

సీఈవోతో కలెక్టర్‌ ఎ.మల్లికార్జున

వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న కలెక్టర్‌ ఎ.మల్లికార్జున, చిత్రంలో జేసీ మయూర్‌ అశోక్, ఏడీసీ కేఎస్‌ విశ్వనాథన్, కమిషనర్‌ సాయికాంత్‌వర్మ, డీఆర్వో మోహన్‌కుమార్‌

వన్‌టౌన్, న్యూస్‌టుడే: ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ ఎ.మల్లికార్జున వెల్లడించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మూడంచెల భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నామని పేర్కొన్నారు. నిర్ణీత సమయంలో ఫలితాలను వెల్లడించేందుకు ఈసీ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. గురువారం ఉదయం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్‌కుమార్‌మీనా రాష్ట్ర సచివాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీసీలో కలెక్టర్‌ మల్లికార్జున కలెక్టరేట్‌ నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో చేస్తున్న ఏర్పాట్లను సీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నామన్నారు. కేంద్ర బలగాలతో పాటు సుమారు 500 మంది సివిల్‌ పోలీసులు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. 176 సీసీ కెమెరాలను అమర్చి మానటరింగ్‌ రూమ్‌కు అనుసంధానం చేసినట్లు వివరించారు.

  • పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో లెక్కింపునకు ఏడు హాళ్లు గుర్తించి 98 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నామని, 140 రౌండ్లలో కౌంటింగ్‌ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఒక టేబుల్‌కు సూపర్‌వైజర్, కౌంటింగ్‌ సహాయకులు, సూక్ష్మ పరిశీలకులను నియమిస్తున్నట్లు చెప్పారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు ప్రక్రియను మూడు రౌండ్లలో పూర్తి చేస్తామన్నారు.
  • అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలైన పోస్టల్‌ బ్యాలట్ల లెక్కింపునకు అయిదు హాళ్లలో 33 టేబుళ్లు ఉంటాయన్నారు. ఈనెల 25న తొలి విడత, జూన్‌ 2న రెండో విడత ర్యాండమైజేషన్‌ ప్రక్రియను నిర్వహిస్తామని కలెక్టర్‌ వివరించారు. వీసీలో జీవీఎంసీ కమిషనర్‌ సాయికాంత్‌ వర్మ, అదనపు కమిషనర్‌ కేఎస్‌ విశ్వనాథన్, జేసీ మయూర్‌అశోక్, డీఆర్వో మోహన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు