logo

బి.బి.పట్నంలో నిధుల స్వాహాపై విచారణ

బి.బి.పట్నం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు నాడు-నేడులో మంజూరైన నిధుల స్వాహాకు సంబంధించి పూర్వ ప్రధానోపాధ్యాయుడు బాబ్జీరావుపై అధికారుల బృందం శుక్రవారం విచారణ నిర్వహించింది.

Published : 25 May 2024 02:17 IST

రోలుగుంట, న్యూస్‌టుడే: బి.బి.పట్నం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు నాడు-నేడులో మంజూరైన నిధుల స్వాహాకు సంబంధించి పూర్వ ప్రధానోపాధ్యాయుడు బాబ్జీరావుపై అధికారుల బృందం శుక్రవారం విచారణ నిర్వహించింది. మాకవరపాలెం మండలం గిడుతూరు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా కొనసాగుతున్న బాబ్జీరావు బి.బి.పట్నంలో పనిచేస్తున్న సమయంలో సుమారు రూ. 61 లక్షల నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలున్నాయి. గతేడాది నవంబరులో విచారణ జరగ్గా.. ఆయనపై ఈ నెల 17న ఆర్‌జేడీ విజయభాస్కర్‌ సస్పెన్షన్‌ వేటు వేశారు. గత ఏడాది బదిలీల ప్రక్రియలో బాధ్యతలు అప్పగించే సమయంలో రికార్డులను అందజేశారు. నాడు-నేడు నిధుల్లో డ్రా చేసిన మొత్తానికి, చేపట్టిన పనులకు పొంతన లేకపోవడంతో జులై నెలాఖరులోగా పూర్తి చేస్తామని లిఖితపూర్వకంగా రాసిచ్చారు. బదిలీ తర్వాత నాడు-నేడు పనుల్లో ప్రగతి ఎలా ఉంది? అనే అంశాలపై మరోసారి సమగ్రశిక్షా అభియాన్‌ డీఈ జగదీష్, ఏఈ సత్యనారాయణ శుక్రవారం పాఠశాలలో రికార్డులను పరిశీలించి విచారణ చేపట్టారు. ప్రధానోపాధ్యాయుడు అప్పారావు, పాఠశాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని