logo

డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంఓ డాక్టర్‌ లక్ష్మీ తులసి సరెండర్‌

కేజీహెచ్‌ పరిపాలన వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించే డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంఓ, ఇన్‌ఛార్జి సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంఓ డాక్టర్‌ లక్ష్మీ తులసిని ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తూ వైద్య విద్యాసంచాలకులు (డీఎంఈ) డాక్టర్‌ నర్సింహం ఉత్తర్వులు జారీ చేశారు.

Published : 25 May 2024 02:31 IST

వన్‌టౌన్, న్యూస్‌టుడే: కేజీహెచ్‌ పరిపాలన వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించే డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంఓ, ఇన్‌ఛార్జి సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంఓ డాక్టర్‌ లక్ష్మీ తులసిని ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తూ వైద్య విద్యాసంచాలకులు (డీఎంఈ) డాక్టర్‌ నర్సింహం ఉత్తర్వులు జారీ చేశారు. డీఎంఈ ఆదేశాల మేరకు ఆమెను తప్పిస్తూ ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్‌ పి.అశోక్‌కుమార్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇన్‌ఛార్జిగా ప్రస్తుతం ఆర్‌ఎంఓగా పనిచేస్తున్న డాక్టర్‌ దవళ భాస్కర్‌రావుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. శుక్రవారం ఉదయమే ఆయన బాధ్యతలు స్వీకరించారు. 

  • డాక్టర్‌ లక్ష్మీ తులసి 8నెలల క్రితమే ఆసుపత్రి డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంఓగా వచ్చారు. ఆరోగ్యశాఖ సంచాలకులు (డిహెచ్‌) పరిధిలో విధులు నిర్వహించే ఆమెను కేజీహెచ్‌కు కేటాయించారు. ఇక్కడ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పలు ఆరోపణలు వచ్చాయి. ఇటీవల ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ విభాగాధిపతి డాక్టర్‌ లక్ష్మీ తులసిపై నేరుగా సీఎంఓకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఫిర్యాదు ఆధారంగా డీఎంఓ డాక్టర్‌ నర్సింహం గతంలో కేజీహెచ్‌కు వచ్చి విచారణ జరిపారు. రెండు రోజుల క్రితం విజయవాడకు పిలిపించి విచారించారు. అనంతరం ఆమెను సరెండ్‌ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఈ మేరకు మాతృశాఖ ఆరోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్‌) కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని డీఎంఈ ఆదేశించినట్లు సమాచారం. ఈ విషయం కేజీహెచ్‌ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆరోపణలపై కీలక వైద్యాధికారిని సరెండర్‌ చేయడం ఇటీవల కేజీహెచ్‌లో చోటు చేసుకోలేదు. గత నెలలో నర్సింగ్‌ విభాగ గ్రేడ్‌-1 పర్యవేక్షకులు విజయలక్ష్మిని అవినీతి ఆరోపణలపై సరెండర్‌ చేశారు. ఇటీవల కాలంలో అధికారుల స్థాయిలో అవినీతి ఆరోపణలు వెల్లువలా వస్తున్నాయి. దిగువస్థాయి ఉద్యోగులను దూషించడం, నచ్చనివారి పట్ల కఠినంగా వ్యవహరించడం, తదితర ఆరోపణలు ఉన్నాయి. 
  • ఇక్కడ అధికారుల తీరుతెన్నులపై నేరుగా సీఎంఓ, ఇతర ఉన్నతాధికారుల కార్యాలయాలకు ఫిర్యాదులు వెళుతున్నాయి. స్థానికంగా ఉన్నతాధికారులు అందుబాటులో ఉన్నప్పటికీ వారి దృష్టికి ఇక్కడి వ్యవహరాలను తీసుకెళ్లడం లేదు. అంతా ఏకమవుతుండడంతో న్యాయం జరగదనే ఉద్దేశంతో నేరుగా ఫిర్యాదులు వెళుతున్నాయని చెబుతున్నారు. ఇప్పటికైనా కేజీహెచ్‌లో పనిచేసే అధికారుల తీరుపై కలెక్టర్‌ దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు