logo

చెట్టు నీడే గతి..అదే విశ్రాంతి గది!!

కేజీహెచ్‌లో నవజాత శిశు సంరక్షణ కేంద్రం (ఎస్‌ఎన్‌సీయూ-2) వద్ద శిశువుల తల్లులు, బంధువులు వేచి ఉండేందుకు గదులు లేవు. శిశువుల తల్లులు అందుబాటులో ఉండాలంటే ఇక్కడి చెట్ల నీడే గతి.

Published : 26 May 2024 03:13 IST

రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుడారం 

కేజీహెచ్‌లో నవజాత శిశు సంరక్షణ కేంద్రం (ఎస్‌ఎన్‌సీయూ-2) వద్ద శిశువుల తల్లులు, బంధువులు వేచి ఉండేందుకు గదులు లేవు. శిశువుల తల్లులు అందుబాటులో ఉండాలంటే ఇక్కడి చెట్ల నీడే గతి.  తీవ్ర ఉక్కపోతలో చెట్ల కింద తమతో తెచ్చుకున్న చాపలపైనే కూర్చుని వేచి ఉండాల్సిన దుస్థితి. మండుటెండల్లో ఉక్కపోత భరించలేక విసనకర్రలతో సేద తీరుతున్నారు.కనీస సౌకర్యాలు లేక నానా అగచాట్లు పడుతున్నారు. ఇటీవల రెడ్‌క్రాస్‌ సంస్థ చిన్నపాటి గుడారాన్ని సమకూర్చినా.. అందులో ఎటువంటి సౌకర్యాలు లేవు. కొద్ది మందికి మాత్రమే ఇది సరిపోతుంది. నిత్యం ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి ఈ విభాగానికి నవజాత శిశువులతో చికిత్స కోసం వచ్చే బాలింతల దుస్థితికి కేజీహెచ్‌లో పరిస్థితే నిదర్శనం. ఉన్నతాధికారులు స్పందించి త్వరితగతిన సౌకర్యాలు కల్పించాలని ఇక్కడికి వచ్చిన వారు కోరుతున్నారు.

కేజీహెచ్‌లో ఆరుబయట చెట్టు కింద వేచి ఉన్న నవజాత శిశువుల కుటుంబీకులు

ఈనాడు, విశాఖపట్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని