logo

కేజీహెచ్‌లో పాము కలకలం

కేజీహెచ్‌లోని కార్డియాలజీ విభాగం వద్ద ఆదివారం సాయంత్రం ఓ పాము కొద్దిసేపు కలకలం సృష్టించింది. పామును అక్కడ వేలాడుతున్న తీగలపై చూసి జనమంతా ఒక్కసారిగా భయాందోళనకు గురై పరుగులు తీశారు.

Published : 27 May 2024 04:35 IST

 తీగలకు చుట్టుకొని ఉన్న పాము 

ఈనాడు, విశాఖపట్నం : కేజీహెచ్‌లోని కార్డియాలజీ విభాగం వద్ద ఆదివారం సాయంత్రం ఓ పాము కొద్దిసేపు కలకలం సృష్టించింది. పామును అక్కడ వేలాడుతున్న తీగలపై చూసి జనమంతా ఒక్కసారిగా భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఈ లోపల పాము తీగల పైనుంచి దిగి అక్కడే ఉన్న మ్యాన్‌హోల్‌లోకి వెళ్లిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సంబంధిత అధికారులు ఇలాంటివి పురావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రోగులు, వైద్య సిబ్బంది, తదితరులు కోరుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు